మగువను అందంగా తీర్చిదిద్దేది కేవలం మేకప్ మాత్రమే కాదు.. వారు ధరించే వస్త్రధారణ కూడా.. ఎలాంటి స్త్రీలైనా సరే చీరకట్టులో ఎంతో అద్భుతంగా కనిపిస్తూ ఉంటారు. చీరకట్టులో ఇంకా అందంగా నాజూగ్గా కనిపించడం కోసం రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు.. కొంతమంది బొద్దుగా ఉన్న వారు చీరలో కూడా సన్నగా కనపడాలని ఆలోచిస్తూ ఉంటారు.. బొద్దుగా ఉన్నవాళ్లు చీరకట్టులో కూడా నాజుగ్గా కనిపించాలంటే ఇప్పుడు చెప్పబోయే కొన్ని టెక్నిక్స్ ను ఫాలో అవ్వండి..

చీరకట్టులో అందంగా కనిపించాలి అంటే, బరువైన చీరలు , హెవీ మేకప్ వల్ల మీరు అనుకున్న కల నెరవేరదు.. మీరు ఎంచుకునే చీరల రంగు కూడా మీరు నాజూగ్గా కనబడటం కోసం సహాయపడుతుంది.. లైట్ కలర్ సారీస్ ఎంచుకోవడం వల్ల ఎవరు అయినా సరే చాలా సన్నగా, నాజుగ్గా కనపడతారు.. ఈసారి షాపింగ్ కి వెళ్ళినప్పుడు లైట్ కలర్ వుండే చీరను సెలెక్ట్ చేసుకుంటే  చాలా బాగా కనిపిస్తారు.. ఒకవేళ మీరు సన్నగా కనపడాలంటే లైట్ గోల్డ్ లేదా లైట్ సిల్వర్ ఆభరణాలను ధరిస్తే మరింత అందంగా కనిపిస్తారు..

చీరలలో కూడా చాలా రకాల ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కాబట్టి. ఫాబ్రిక్ కూడా మీ శరీరానికి అనువుగా ఉండేలా చూసుకోవాలి. ఇక నెట్ లేదా షిఫాన్ చీరలను ఎంచుకున్నట్లు అయితే, అలాంటివి శరీరం  పైనా సరిగా నిలబడవు. జార్జెట్ లేదా క్రేప్ సిల్క్  వంటి ఫాబ్రిక్ ను ముందుగా ప్రిఫర్ చేయండి.. అలాగే సాఫ్ట్ సిల్క్ తో పాటు కాటన్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది. పెద్ద పెద్ద అంచులు, హెవీ గా ఉండే చీరను కూడా తీసుకోవద్దు. స్టోన్స్, క్రిస్టల్స్ వంటి వాటిని ఇక అసలకి ముట్టుకోవద్దు.. సింపుల్ బార్డర్ ఉండే వాటిని మీరు ధరించినట్లయితే చాలా మంచిది.. మీరు చాలా సన్నగా అందంగా కనపడాలి అంటే సింపుల్గా ఉండే వాటిని ఎంచుకోవడం ఉత్తమం..

చీరతోపాటు పెట్టికోట్, జ్యువెలరీ, మేకప్, జాకెట్ వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ  సారించాలి.. శరీర ఆకృతిని బట్టి జాకెట్టు స్టిచ్ చేయించుకోవాలి. స్లీవ్ లెస్  జాకెట్స్ చూడడానికి బాగా అనిపించదు కాబట్టి స్లీవ్ కొంచెం పెద్దగా ఉండే బ్లౌజ్ ను  ప్రిఫర్ చేయడం వలన లావుగా ఉన్నా సరే బొద్దుగా ఉన్నా సరే నాజూగ్గా  కనిపిస్తారు.. లంగా కూడా స్కర్ట్ షేప్ ఉండేటట్లు చూసుకోవడం చాలా మంచిది..ఈ ట్రిక్స్  పాటించి చూడండి.. చాలా అద్భుతంగా కనిపిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: