ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం కమలహాసన్ ప్రొడక్షన్ బ్యానర్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ఒక భారీ ప్రాజెక్ట్ రూపొందిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో శ్రీదేవి ఒక కీలకమైన పాత్ర కోసం లేదా ,హీరోయిన్గా ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ విషయాన్ని నేరుగా చెప్పకుండా శ్రీదేవి తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక హింట్ ఇచ్చినట్లుగా వినిపిస్తోంది. 1991లో రజనీకాంత్ నటించిన దళపతి చిత్రంలోని ఒక ఐకానిక్ స్టైలిష్ పోజును ఇమిటేట్ చేస్తూ శ్రీదేవి దిగిన ఫోటోని షేర్ చేసింది.
తన ఇన్స్టాగ్రామ్ లో ఈ ఫోటో షేర్ చేయడంతో నెటిజెన్స్ సైతం కమలహాసన్, రజనీకాంత్ ప్రాజెక్టులో శ్రీదేవి ఎంట్రీ ఇస్తోంది అంటు కామెంట్స్ చేస్తున్నారు. అందుకే ఈ దళపతి హింట్ డీకోడ్ చేసిందంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. సాధారణంగా ఏ హీరోయిన్ కైనా సరే సూపర్ స్టార్ రజినీకాంత్ వంటి చిత్రాలలో ఏదైనా చిన్న క్యారెక్టర్ దొరికిన చాలు అనుకుంటారు. అలాంటిది ఇప్పుడు శ్రీదేవి అతి తక్కువ సమయంలోనే రజినీకాంత్ వంటి సినిమాలలో అవకాశం లభించడం అంటే అది ఒక అరుదైన రికార్డ్డే అని చెప్పవచ్చు. మరి ఈ విషయం పైన కోర్టు మూవీ హీరోయిన్ శ్రీదేవి ఏ విధంగా క్లారిటీ ఇస్తుందో చూడాలి మరి. ప్రస్తుతం మాత్రం ఈ విషయం వైరల్ గా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి