బట్టలు వాష్ చేసిన తర్వాత క్లీన్ చేయడం మర్చిపోతే మెషిన్ నుంచి దుర్వాసన రావడం ఖాయం. ఎందుకంటే బట్టల లో ఉండే మురికి మెషిన్ లో పేరుకుపోయి దుర్వాసన రావడంతో పాటు బట్టలు కూడా దుర్వాసన రావడం మొదలు పెడతాయి. కాబట్టి వాషింగ్ మిషన్ లో సెల్ఫ్ క్లీన్ ఉంటుంది కాబట్టి ఎందుకు క్లీన్ చేయాలి అనే విషయాన్ని పక్కన పెట్టి, తప్పకుండా ఐదు నిమిషాలు పాటు మిషన్ ను క్లీన్ చేయండి.
ఎంత డిటర్జెంట్ పౌడర్ వేయాలో కూడా చాలా మందికి తెలియదు అనే చెప్పాలి. ఒక్కోసారి ఎక్కువ వేయడం లేదా చాలా తక్కువ వేయడం చేస్తూ ఉంటారు.
బట్టలను శుభ్రం చేయడం వేరు.. అలాగే డిస్ ఇన్ఫెక్ట్ చేయడం వేరు. ప్రస్తుతం బట్టలపై ఉండే వైరస్ కారణంగా ఒకరి నుండి మరొకరికి వైరస్ సోకుతుంది అని వైద్యులు చెబుతున్నారు.. కాబట్టి బట్టలు వాష్ చేసిన తర్వాత మరో రెండు నిమిషాల పాటు డిస్ ఇన్ఫెక్షన్ లిక్విడ్ వేసి బట్టలు వాష్ చేయడం వల్ల బట్టల పై ఉండే క్రిములు కూడా చనిపోతాయి.
తెల్లని వస్త్రాలను ప్రత్యేకంగా వాష్ చేయడం మంచిది.. ఈ పద్ధతి తెలిసి కూడా చాలా మంది పాటించరు.. అలా పాటించకపోవడం వల్ల మిగతా బట్టలకు వుండే రంగు.. తెల్లని బట్టలకు అంటుకుని అవి పాడైపోతాయి.
బట్టలను వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు తిప్పి వేయడం మంచిది. ఎందుకంటే మన శరీరం మీద చెమట సూక్ష్మక్రిములు ఉంటాయి కాబట్టి , ఇవి తొలగిపోవాలి అంటే బట్టలను తిప్పి వేయడం మంచిది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి