సాధారణంగా చక్కెర బదులు బెల్లం తినడం ఉత్తమం అని, ఎక్కువగా బెల్లాన్ని తింటూ ఉంటాం. ఇందులో ఐరన్, పొటాషియం,మెగ్నీషియం వంటి పోషకాలు ఎన్నో శరీరానికి అందించి,శరీర ఆరోగ్యాన్ని కాపాడడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ముఖ్యంగా ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల గర్భిణీ స్త్రీలకు కూడా రక్తహీనత తగ్గించుకోవడానికి,బెల్లంతో తయారుచేసిన పదార్థాలు ఎక్కువగా తినమని వైద్యులు సూచిస్తూంటారు. ఇలాంటి ఆరోగ్య ప్రయోజనాలు వున్న బెల్లం ను అదే పనిగా అతిగా తినడం వల్ల కొన్ని రకాల దుష్ప్రభావాలు కూడా కలుగుతాయని శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి మరీ నిరూపించారు.అలాంటి అనారోగ్య సమస్యలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

1. బెల్లం అధికమోతాదులో తినడం వల్ల, ఇందులోని సుక్రోస్ మరియు ప్రక్టోజ్ చక్కెరలు ఎక్కువగా ఉండడం వల్ల అధికబరువుకు దారితీస్తుంది. మామూలుగా చక్కెర తినడం వల్ల బరువు పెరుగుతారనే  అపోహ ఉంది. కానీ బెల్లం తినడం వల్ల కూడా అధికబరువు పెరుగుతారు. కావున బరువు తగ్గాలి అనుకునేవారు బెల్లం తినకపోవడమే చాలా మంచిది.

2. సాధారణంగా బెల్లంకు వేడి చేసే గుణంఉంటుంది. కావున వేసవికాలంలో బెల్లం తినకపోవడమే ఉత్తమం. బెల్లంని అధికంగా తీసుకోవడం వల్ల ఈ సీజన్లో ముక్కు నుంచి రక్తం కారడం,అధికడిహైడ్రేషన్, వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

3. మధుమేహ రోగులు చక్కెర తినడం వల్ల మాత్రమే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి అనుకుంటే అది తప్పే అవుతుంది. బెల్లంవల్ల కూడా అధికచక్కెరలు శరీరానికి అంది, రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ని పెంచుతాయి.కావున మధుమేహరోగులు బెల్లం కూడా తీసుకోకపోవడం ఉత్తమం.

4. బెల్లంలో అధికఫైబర్ ఉంటుంది. దీనిని తగిన మోతాదులో తీసుకోవడం వల్ల ఉన్న సంబంధిత సమస్యలు తొలగుతాయి. కానీ అధిక మోతాదులో తీసుకోవడం వల్ల మలబద్ధకం,అతిసారం అసిడిటీ, కడుపుఉబ్బరం వంటి సమస్యలు కలుగుతాయని వైద్యులు హెచ్చరిస్తూన్నారు.

5.  ఎక్కువ మొత్తంలో దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో మంట, కీళ్లనొప్పులు అధికమయే అవకాశాలు ఎక్కువ.

మరింత సమాచారం తెలుసుకోండి: