
కొంతమంది మాత్రం మనిషిగా పుట్టినందుకు ఇక తమ జీవితానికి తమ చేతులతోనే కొత్త రూపురేఖలను దిద్దుకుంటున్నారు. ఎంతటి కష్టాన్నయినా భరించి ఉన్నత శిఖరాలను చేరుకుంటున్నాడు. ఇక అలాంటి కోవకు చెందిన వాడే ఇక ఇప్పుడు మనం చెప్పుకునే ఎంబీఏ చదివిన ఛాయివాల. చదివింది ఎంబీఏ అంటున్నారు. అతను ఒక ఛాయ వాలా అంటున్నారు. ఎక్కడో సింక్ అవడం లేదు అని అనుకుంటున్నారు కదా.
అతను ఎంబీఏ చదివాడు కాకపోతే ఫెయిల్ అయ్యాడు. కానీ జీవితంలో మాత్రం సక్సెస్ అయ్యాడు. అది కూడా టీ కొట్టు పెట్టుకొని ఒకప్పుడు ఏమీ లేని స్థాయి నుంచి జీవితాన్ని ప్రారంభించి ఇక ఇప్పుడు 92 లక్షల విలువ చేసే ఒక ఖరీదైన కారు కొనుక్కునే స్థాయికి ఎదిగాడు . మధ్యప్రదేశ్ కు చెందిన ప్రపుల్ అనే వ్యక్తి 2016లో అహ్మదాబాద్ లో ఎంబీఏ చదివాడు. అయితే అనుకోని కారణాలవల్ల ఇక అతను ఎంబీఏ పాస్ కాలేకపోయాడు. అయినప్పటికీ అతను ఫీల్ కాలేదు. అతని మనసులో ఒక గొప్ప ఆలోచన తట్టింది.
మిస్టర్ బిలియనీర్ అహ్మదాబాద్ పేరిట ఒక టీ కొట్టును పెట్టాడు. ఇక ఈ బిజినెస్ కూడా మొదట్లో సక్సెస్ కాలేదు. కానీ పట్టు విడువని విక్రమార్కుడిలా అతను తన కష్టాన్ని నమ్ముకున్నాడు. ఇంకేముంది అతని బిజినెస్ ఊహించని రీతిలో పుంజుకుంది. ఇక సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ సంపాదించింది. ప్రస్తుతం కోట్ల రూపాయల టర్నోవర్తో బిజినెస్ నిర్వహిస్తున్నాడు. సంవత్సరానికి దాదాపు 5 కోట్లకు పైగానే అతని సంపాదన. ఇటీవలే 92 లక్షల రూపాయల ఖరీదైన కారు కొన్నాడు. ఇక ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారిపోయింది.