ప్రతి రోజు మనం ఒక గిన్నె మామిడి పండ్ల ముక్కలను అల్పాహారంగా తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.ఎందుకంటే మామిడి పండ్లలో పెద్ద మొత్తంలో డైటరీ ఫైబర్ ఉంటుంది. మామిడిపండ్లు  మీకు మరింత శక్తిని కలిగిస్తాయి. మామిడిపండ్లు ఒక అద్భుతమైన ప్రీ-వర్కౌట్ భోజనంగా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అయితే మామిడి ముక్కలు చేసే తినే బదులు మామిడి పండును మొత్తంగా తింటే ఆరోగ్యానికి చాలా మేలు.మనకు పెద్ద రసాలు ఇంకా చిన్నరసాలు వంటి కాయలు ముక్కలు చేయడానికి పని చేయవు. కాబట్టి మామిడిని పండుగా మొత్తం తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా చేయడం ద్వారా మామిడిలో ఉండే పీచు రసం శరీరానికి బాగా మేలు చేస్తుంది.చాలా మంది కూడా తిన్న తర్వాత మామిడిని తింటూ ఉంటారు.ఇంకా అలాగే పెరుగు అన్నంలో కలిపి మామిడిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇలా తినడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల మీ శరీరం అదనపు కేలరీలను స్టోర్ చేస్తుంది.


మామిడి పండ్లను మధ్యాహ్నం తీసుకోవడం చాలా మంచిది.అలాగే మామిడి పండ్లను చిరుతిండిగా కూడా తినవచ్చు.మామిడి పండులో ఫైబర్ ఇంకా సూక్ష్మపోషకాలు పుష్కలంగా ఉంటాయి.మీరు కనుక బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నట్లయితే మీరు వాటిని ఇప్పటికీ తినవచ్చు. మామిడి పండులో 99 కేలరీలు, 1.4 గ్రాముల ప్రోటీన్, 25 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 22.5 గ్రాముల చక్కెర, 2.6 గ్రాముల ఫైబర్, 67 శాతం విటమిన్ సి, 18 శాతం ఫోలేట్, 10 శాతం విటమిన్ ఎ ఇంకా 10 శాతం విటమిన్ ఈ ఉంటాయి. అలాగే కాల్షియం, జింక్, ఐరన్, మెగ్నీషియం కూడా ఇందులో నిక్షిప్తమై ఉంటాయి. ఇక కొంచెం పుల్లగా ఉండే మామిడి కూడా షుగర్ వ్యాధిగ్రస్తులు తినవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.ఇక మామిడిపండ్లు 51 జీఐ ర్యాంక్‌ను కలిగి ఉన్నాయి. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు తినడానికి ఇవి అనుకూలంగా ఉంటాయి.అయితే వాటిని మితంగా తినాలి. మామిడి పండుని అధికంగా తీసుకోవడం మాత్రం ఆరోగ్యానికి చాలా హానికరం అని గుర్తు పెట్టీకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: