ఈ కాలంలో చాలా రోగాలు కూడా మనల్ని నాశనం చేస్తూ ఉంటాయి.అందువల్ల  జలుబు, జ్వరం, దగ్గు వంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అయితే ఇలా అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే.. వ్యాధి నిరోధక శక్తి అనేది ఖచ్చితంగా మెండుగా ఉండాలి. మీకు ఇమ్యూనిటీ ఎక్కువగా ఉండాలంటే.. ఖచ్చితంగా కొన్ని రకాల ఆహారాలను మీ డైట్‌లో చేర్చుకోవాలి. ప్రతి రోజూ తినే ఆహారంలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండే ఆహారాలు తినాలి. వాటిని తినడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉండొచ్చు. మరి అవేంటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.పుట్ట గొడుగులు తినడం వల్ల కూడా శరీరంలో ఇమ్యూనిటీ లెవల్స్ పెరుగుతాయి. వీటిల్లో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, విటమిన్లు, బి, సి, ఇతర పోషకాలు ఉంటాయి. మష్రూమ్స్ తినడం వల్ల తెల్ల రక్త కణాలను యాక్టీవ్ అవుతాయి. దీంతో అంటు వ్యాధులు వంటివి తర్వగా ఎటాక్ చేయకుండా ఉంటాయి.రోగ నిరోధక శక్తి పెరగడాలంటే ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. పెరుగులో ప్రోబయోటిక్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి.


దీని వల్ల శరీరంలో ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. పెరుగు తీసుకోవడం వల్ల ఒంట్లో మంట కూడా తగ్గుతుంది. ప్రతి రోజూ ఒక కప్పు పెరుగు తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది.ఇమ్యూనిటీ ఎక్కువగా ఉండాలంటే.. పోషకాలు అన్నీ ఉండే ఆహారాలు తీసుకోవాలి. ముఖ్యంగా విటమిన్ సి, జింక్, ఐరన్, ప్రోటీన్ వంటివి తప్పని సరి. డ్రై ఫ్రూట్స్‌లో ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి. అందుకే ప్రతి రోజూ నీటిలో నానబెట్టిన నట్స్, సీడ్స్ తీసుకుంటే మంచిది.ప్రతి రోజూ తినే ఆహారంలో కూరగాయలు, పండ్లు ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. అలాగే టమాట, బీట్ రూట్, పాల కూర వంటి వాటిల్లో ఐరన్, క్యాల్షియం ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి బలాన్ని ఇస్తాయి.మన శరీరంలో ఇమ్యూనిటీ ఎక్కువగా పెరగాలంటే.. సిట్రస్ ఎక్కువగా వుండే ఫుడ్స్‌ని తీసుకోవాలి.ఎందుకంటే సిట్రస్‌లో పండ్లు, ఆహారంలో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే.. తెల్ల రక్త కనాల ఉత్పత్తి పెరుగుతంది. దీని వల్ల అంటు వ్యాధులు ఎక్కువగా రాకుండా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: