మనం నిత్యం వంటల్లో ఉపయోగించే పదార్ధాల్లో ఉల్లిపాయ ఒకటి. మనకు మార్కెట్లో మొత్తం రెండు రకాల ఉల్లిపాయలు కనిపిస్తాయి. వీటిలో ఒకటి తెల్ల ఉల్లిగడ్డ ఇంకోటి ఎర్ర ఉల్లిగడ్డ. నగరాల్లో మనం దాదాపు మనం ఎర్ర ఉల్లి గడ్డలనే చూస్తాం.మనకు చాలా తక్కువగా మాత్రమే ఈ తెల్ల ఉల్లిగడ్డలు కనిపిస్తాయి. అయితే గ్రామాల్లో మాత్రం ఎక్కువగా తెల్ల ఉల్లిగడ్డను చూస్తుంటాం. ఇక ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి ఏది మంచిది.? ఏ ఉల్లిగడ్డ తినడం వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.అయితే ఎర్ర ఉల్లిగడ్డతో పోల్చితే తెల్ల ఉల్లిగడ్డ ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే తెల్ల ఉల్లిగడ్డ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలే. తెల్లి ఉల్లిపాయలో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు ఎక్కువగా ఉంటాయి. వీటిలో ఎక్కువగా విటమిన్‌ సి, ఫ్లేవనాయిడ్స్‌, ఫైటోన్యూట్రియెంట్‌ ఆరోగ్యాన్ని కాపాడడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో తెల్ల ఉల్లిగడ్డ కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


తెల్ల ఉల్లి పాయలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ శరీరంలోని కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇంకా అధిక రక్తపోటును తగ్గించడానికి, రక్తం గడ్డ కట్టకుండా నిరోధించడానికి కూడా తెల్ల ఉల్లి సహాయ పడుతుంది. అయితే ఎర్ర ఉల్లి గడ్డలో కూడా ఇలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా.. ఎక్కువగా మాత్రం తెల్ల ఉల్లిగడ్డలోనే ఎక్కువగా లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.తెల్ల ఉల్లిలోని క్రోమియమం, సల్ఫర్‌లు రక్తంలోని షుగర్‌ స్థాయిలను నియంత్రిస్తుంది. దీంతో ఈ ఉల్లిగడ్డను క్రమం తప్పకుండా తీసుకుంటే మధుమేహాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అంతేకాకుండా తెల్ల ఉల్లిలోని సల్ఫర్‌ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌ క్యాన్సర్‌ కారకాలతో పోరాడుతుంది. ముఖ్యంగా శరీరంలో ఏర్పడే కణితిల పెరుగుదులను నిరోధించడంలో తెల్ల ఉల్లి పాయ కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి వీలైతే తెల్ల ఉల్లిపాయని కొనుగోలు చేసి వంటల్లో వాడండి.

మరింత సమాచారం తెలుసుకోండి: