మనం ఎంత కూల్ గా ఉన్నా కూడా ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా కోపం వస్తుంది. దాన్ని ఆపలేము కాబట్టి ఖచ్చితంగా తగ్గించుకోవాలి. లేదంటే మన ప్రాణానికే ప్రమాదం అని తేలింది.ఎక్కువగా కోపం వస్తే మన శరీరంలో హార్మోన్లు ఉత్తేజితమవుతాయి. దీని వల్ల గుండె కొట్టుకోవడం పెరుగుతుంది. దీనివల్ల బీపీ, గుండెపోటు వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. అంతేకాదు రక్తనాళాల లోపలి పొరకు చాలా నష్టం వాటిల్లుతుంది. రక్త ప్రసరణలో ప్లేట్‌లెట్స్, లిపిడ్‌లు పేరుకుపోవడానికి కారణమవుతుంది. ఇది తరువాత గుండెపోటుకు కారణమవుతుంది. కోపం గుండెకు హాని కలిగించడమే కాకుండా చిరాకు, అలసట, భావోద్వేగ నష్టం, నిద్ర లేకపోవడం, నిరాశ, ఒత్తిడి ప్రమాదాన్ని పెంచుతుంది. మద్యానికి, సిగరెట్లకు, డ్రగ్స్‌కు బానిసలైన వారికి చాలా కోపం వస్తుంది. ఇది మొత్తం ఆరోగ్యానికి పెద్ద హాని కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.రక్తనాళాల పనితీరుకు కోపం అస్సలు ఏమాత్రం కూడా మంచిది కాదు. కోపం వల్ల స్వంత పరిస్థితిని పాడు చేసుకుంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


కోపం గుండెకు మంచికి కాదని విషయం చాలామందికి కూడా తెలియదు. ఇది జీవిత నాశనానికి కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఇది నేరుగా ఆరోగ్యానికి సంబంధించినదని నిపుణులు అంటున్నారు. ఇది రక్త ప్రవాహాన్ని నియంత్రించడంతో పాటు కార్డియోవాస్కులర్ హోమియోస్టాసిస్ ప్రమాదాన్ని పెంచుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.అయితే కోపం అనేది మనకు చాలా హాని కలిగిస్తుంది. అందువల్ల దానిని నియంత్రించడానికి ఖచ్చితంగా మనం మన వంతు ప్రయత్నించాలి. అందుకే కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి మనం ఖచ్చితంగా శ్వాస వ్యాయామాలు చేయాలి.ఎందుకంటే యోగా, ధ్యానం సహాయం తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది. మంచి నిద్ర, మంచి ఆహారం, స్నేహితులు ఇంకా మన కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపడం వలన కోపాన్ని చాలా సులభంగా కంట్రోల్‌ చేయవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.కాబట్టి ఖచ్చితంగా పైన తెలిపిన పద్ధతులు పాటించి కోపాన్ని కంట్రోల్ చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: