
ఇంటి పరిసరాలలో కొన్ని రకాల మొక్కలను పెంచడం వల్ల దోమలను కూడా మనం రానివ్వకుండా చేసుకోవచ్చు. అందులో సిట్రోనెల్లా గ్రాస్ అనే గడ్డి మొక్క కూడా ఒకటి.. ఇది ఇంటూ ముందు పెంచుకుంటే చాలు ఈ గడ్డి నుంచి వచ్చే వాసన దోమలకు చాలా ఇరిటేషన్ గా అనిపిస్తుందట. మరొక మొక్క లావెండర్ ఈ మొక్క ఉన్న ఇంటిలో కూడా దోమలు దరి చేరవు ఈ మొక్క యొక్క వాసన దోమలకి అసలు పడదట.
అలాగే మనం దైవంగా పూజించుకొని తులసి చెట్టు కూడా పెంచడం వల్ల దోమలని అరికట్టవచ్చు. అలాగే బంతిపూల మొక్కల ద్వారా వచ్చే వాహనకు దోమలు దరి చేరవు. సిట్రో నేల్లా, మూకలిఫ్టస్ ఆయిల్ ని ఇంట్లో మూలలో స్ప్రే చేస్తే దోమలు నశిస్తాయి.. మన ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా ఇంటి చుట్టూ ఎక్కడా కూడా నీటిమడుగులు, మురికి నీరు వంటివి అసలు నిల్వ ఉండకూడదు. వీటివల్లే దోమలు ఎక్కువగా సంతానాన్ని అభివృద్ధి చేస్తాయి. అప్పుడప్పుడు మన ఇంటి చుట్టు పరిసరాలలో కూడా బ్లీచింగ్ పౌడర్ ని చల్లడం మంచిది.