బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చే పేరు హేమమాలిని మాత్రమే. అలాంటి హేమమాలిని ఒకప్పుడు కుర్రకారు హృదయాలను తన అందంతో దోచేసింది.ఇక అలాంటి ఈ ముద్దుగుమ్మ పెళ్లై నలుగురు పిల్లలున్న ధర్మేంద్రని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ధర్మేంద్రకు అప్పటికే పెళ్లయి పిల్లలు ఉన్నారన్నా సంగతి కూడా తెలుసు.అయినా కూడా అతనితో ప్రేమలో పడింది. అయితే అంత ప్రేమించి పెళ్లి చేసుకున్న హేమమాలిని తన భర్తతో ఎందుకు కలిసి ఉండడం లేదు. ఎందుకు భర్తకు దూరంగా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. హేమ మాలిని ధర్మేంద్ర పెళ్లి అంత సులువుగా ఏమీ జరగలేదు. ఎందుకంటే ధర్మేంద్ర హేమమాలినీని పెళ్లి చేసుకోవాలంటే మొదటి భార్యకి విడాకులు ఇవ్వాలి. ఎందుకంటే హిందూ చట్టంలో మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకోరాదు. 

కానీ ధర్మేంద్రకు తన ఫస్ట్ వైఫ్ కి విడాకులు ఇవ్వడం ఇష్టం లేక చివరికి ముస్లిం మతంలోకి మారి హేమమాలినిని పెళ్లి చేసుకున్నారు. అలా వీరి ప్రేమకు గుర్తుగా ఇద్దరూ ఆడపిల్లలు కూడా పుట్టారు. అయితే ఎంతో గాఢంగా ప్రేమించుకొని ఇష్టంగా పెళ్లి చేసుకున్న హేమమాలిని ధర్మేంద్రతో కలిసి ఉండడం లేదు. అయితే ఈ విషయం గురించి కూడా హేమమాలిని చెప్పింది.. కుటుంబంలో అందరూ మధ్య ప్రశాంతంగా, గౌరవంగా ఉండాలని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను.ధర్మేంద్రతో కలిసి ఉండకూడదు అనే విషయంలో ఆయనతో నాకు గొడవలు ఏమీ లేవు. కానీ కుటుంబం కోసమే నిర్ణయం తీసుకున్నా. ధర్మేంద్ర నా కోసం నా పిల్లల కోసం ఏం చేసినా హ్యాపీగానే ఉంటా. నేను ఎవరిని డిస్టర్బ్ చేయాలని అనుకోలేదు అంటూ తన బయోగ్రఫీగా వచ్చిన హేమమాలిని బియాండ్ ది డ్రీమ్ గర్ల్ లో ఈ విషయాలన్నీ బయటపెట్టింది.

అలాగే భర్తతో కలిసి ఉండకపోవడం వల్ల ఒంటరితనంగా ఫీల్ అయ్యారా అనే విషయం గురించి కూడా క్లారిటీ ఇస్తూ.. ధర్మేంద్ర తో కలిసి లేనందుకు నేను మీరు అనుకుంటున్నాంత విచారంగా ఏమీ లేను. నేను నా లైఫ్ లో చాలా సంతోషంగా ఉన్నాను. అలాగే ధర్మేంద్ర నా దగ్గరికి ఎన్ని సార్లు వచ్చారు అని రిజిస్టర్ మెయింటైన్ చేయలేను అంటూ తనపై వచ్చిన విమర్శలకు ఘాటుగా స్పందించింది. అంతేకాదు కొంతమంది తన మొహం పట్టుకొని రెండో పెళ్ళాం అని ఎగతాళిగా మాట్లాడిన మాటలు పట్ల కూడా కౌంటర్ ఇచ్చింది.అలా ప్రేమించి పెళ్లి చేసుకున్న హేమమాలిని ధర్మేంద్రతో పెళ్లి తర్వాత విడివిడిగా ఉండాలని ఓ నిర్ణయం తీసుకున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: