పాన్ ఇండియా హీరోయిన్ గా దూసుకుపోతున్న తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ల అయినా కూడా తన హవా ఇంకా తగ్గడం లేదు.. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుస సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేస్తూ బిజీగా గడుపుతుంది. సినిమాల్లో ఎలాంటి పాత్ర ఇచ్చిన చాలు అన్నట్లు అది ఐటమ్ సాంగ్ కానీ..సహాయకపు పాత్ర కానీ.. గెస్ట్ రోల్ కానీ.. ఏ పాత్ర అయినా సరే ఓకే చెప్పేస్తుంది.. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మపై గత కొద్ది రోజులుగా ఒక ఆరోపణ వినిపిస్తోంది. అదేంటంటే.. తమన్నా స్క్రీన్ పై ఇంకా యంగ్ గా కనిపించడం కోసం స్లిమ్ గా కనిపించడం కోసం ఓ ఇంజక్షన్ వాడుతోందని.. అయితే దీని గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. 

తమన్నా గత కొద్ది రోజులుగా ఓజంపిక్ అనే ఇంజక్షన్ ని ఇంజెక్ట్ చేసుకుంటుంది అని..స్లిమ్ గా కనిపించి ఆఫర్లు రావడం కోసమే తమన్నా ఇలాంటి చెత్త పని చేస్తుంది అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇక ఈ ఆరోపణల నేపద్యంలో తాజాగా తమన్నా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేసింది. నేను చాలా సంవత్సరాల నుండి ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను.. నేను సినిమాల్లోకి 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే వచ్చాను.అప్పటి నుండి కెమెరా ముందే ఉన్నాను.సో ఈ విషయంలో దాచాల్సిన అవసరం నాకు ఏమీ లేదు.టీనేజ్ లో ఉన్నప్పుడు చాలా స్లిమ్ గా ఉన్నాను. ఇప్పుడు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను.

ఈ విషయం అంత సీక్రెట్ గా ఉంచాల్సిన పనిలేదు. సహజంగా ప్రతి ఒక్క మహిళలో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి బాడీలో మార్పులు కనిపిస్తూ ఉంటాయి. కానీ నాకు నేను కొత్తగా కనిపించడం లేదు. మహిళల శరీరాకృతిలో మార్పులు ఉంటాయి. కాబట్టి ఎప్పటికీ ఒకే రకమైన శరీరాకృతిలో కనిపించలేము అంటూ తమన్నా క్లారిటీ ఇచ్చింది.. ఇక తమన్నా సినిమాల విషయానికొస్తే రాగిణి ఎంఎంఎస్ 3, వ్యాన్, ఓ రోమియో రేంజర్ వంటి సినిమాలు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: