మనందరికీ తెలిసిందే — దేశ రాజధాని ఢిల్లీలో నిన్న సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో ఒక భయంకరమైన పేలుడు సంభవించింది. చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన ఎర్రకోట (రెడ్‌ ఫోర్ట్‌) సమీపంలోని మెట్రో స్టేషన్‌ వద్ద రద్దీగా ఉన్న పార్కింగ్‌ ఏరియాలో నిలిపిన ఒక కారులో ఒక్కసారిగా భారీ బ్లాస్ట్‌ జరిగింది. ఆ సెకండ్‌లోనే చుట్టుపక్కల భవనాలు, వాహనాలు వణికిపోయాయి. ఈ పేలుడు తీవ్రత అంతలా ఉండటంతో, అక్కడే ఉన్న దాదాపు 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 24 మంది తీవ్రంగా గాయపడి సమీప ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొంతమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు.


ఈ ఘటనతో దేశవ్యాప్తంగా సంచలనం రేగింది. సాధారణంగా ఢిల్లీ అంటే దేశ హృదయం, అత్యంత హై సెక్యూరిటీ జోన్‌గా పేరుపొందిన ప్రాంతం. ఇక్కడ ప్రతి వీధిలోనూ సీసీటీవీ కెమెరాలు అమర్చబడి ఉంటాయి. ప్రతి మూలలోనూ పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తుంటారు. దేశాధినేతలు, మంత్రులు, విదేశీ ప్రతినిధులు తరచూ సంచరించే ప్రదేశం ఇది. అలాంటి ప్రాంతంలో ఇంత భారీ పేలుడు జరగడం దేశ భద్రతా వ్యవస్థపైనే ప్రశ్నలు లేవనెత్తింది. పేలుడు జరిగిన ప్రదేశాన్ని ఇప్పటికే ఎన్ఐఏ  మరియు ఢిల్లీ పోలీస్ స్పెషల్‌ సెల్‌ స్వాధీనం చేసుకొని పరిశోధనలు ప్రారంభించాయి. బాంబ్‌ స్క్వాడ్‌ అధికారులు కూడా సైట్‌లో ఉన్న బ్లాస్ట్‌ డెబ్రీస్‌ సేకరించి, పేలుడు పరికరం స్వభావం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ బ్లాస్ట్‌ ఒక హై-ఇంటెన్సిటీ ఇంప్రోవైజ్డ్‌ ఎక్స్‌ప్లోసివ్‌ డివైజ్‌  కారణంగా జరిగిందని అనుమానిస్తున్నారు.


ఇంతటి బిజీ ఏరియాలో ఉగ్రవాదులు బాంబును ఎలా తీసుకువచ్చారు? వాహనాన్ని ఎలా పార్క్‌ చేశారు? పోలీసుల నిఘాకు ఎలా దొరకకుండా వెళ్లిపోయారు? — అనే అంశాలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చలు చెలరేగుతున్నాయి. భద్రతా నిపుణులు చెబుతున్న దాని ప్రకారం, ఇది ఒక యాదృచ్ఛిక సంఘటన కాదని, పూర్తిగా పన్నిన కుట్రగా కనిపిస్తోందని అంటున్నారు. ఇంత బిజీ ఏరియాలో వాళ్ళు బాంబ్ కి సంబంధించిన పరికారలను ఏర్పరచడం చాలా కష్టం . దీనికి అక్కడే ఉన్న వారు సహాయం చేసి ఉండచ్చు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: