మనలో  చాలామంది తగ్గాలని   భావిస్తూ ఉంటారు. బరువు తగ్గడం  మరీ కష్టం కాదు కానీ ఆహారపు అలవాట్లను మార్చుకోవడంతో పాటు   జీవనశైలిలో మార్పులు  చేసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చు.  మీ కేలరీల తీసుకోవడం తగ్గించడం, ఆరోగ్యకరమైన ఆహారాలు తినడం, మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా బరువు తగ్గాలని భావిస్తే మాత్రం సులువుగా మంచి ఫలితాలను పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.

పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రొటీన్లు  ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.  ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర, కొవ్వు అధికంగా ఉండే ఆహారాలను తక్కువగా తీసుకోవాలి.  తగినంత నీళ్లు తాగడంతో పాటు  భోజనం, స్నాక్స్ మధ్య బ్యాలెన్స్ పాటించాలి.   వారంలో  కనీసం   150 నిమిషాల మితమైన ఏరోబిక్ వ్యాయామం  చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

శక్తి శిక్షణ వ్యాయామాలను వారానికి కనీసం రెండుసార్లు  చేయడం  ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి.  ఎంత తింటున్నారో, ఎంత వ్యాయామం చేస్తున్నారో గమనించడంతో పాటు పాజిటివిటీ ఉన్న వ్యక్తులు  మన చుట్టూ ఉంటె మంచిది.  సాధారణ ఆహారం తీసుకుని, మరుసటి రోజు ఉపవాసం ఉండటం లేదా ఒక చిన్న భోజనం తీసుకోవడం చేయడం ద్వారా మంచి ఫలితాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

బరువు తగ్గడానికి సహాయపడే చిక్కీ బార్ వంటి ఆహారాలను తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.  చీకూను ఉదయం లేదా మధ్యాహ్నం స్నాక్‌గా  తీసుకోవాలి.  మీరు బరువు తగ్గడానికి సహాయపడే ఇతర మార్గాల గురించి తెలుసుకోవడానికి మీ వైద్యుడిని లేదా ఆహార నిపుణుడిని సంప్రదించడం ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుందని  చెప్పడంలో సందేహం అవసరం  లేదు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: