రోజూ నిమ్మరసం తాగడం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. ముఖ్యంగా కిడ్నీల ఆరోగ్య పరిరక్షణలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, దీన్ని తాగే విధానం, పరిమాణం, మరియు సమయం కూడా చాలా ముఖ్యం. నిమ్మరసంలో సిట్రిక్ ఆమ్లం అధికంగా ఉంటుంది. ఇది యూరిన్‌లో ఉండే కాల్షియంను కట్టలు అవకుండా అడ్డుకుంటుంది. ముఖ్యంగా కాల్షియం ఆక్సలేట్ రాళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తుంది. రోజూ ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం తాగడం వల్ల చిన్న రాళ్లు కూడా కరిగిపోవచ్చు. నిమ్మరసం తీసుకోవడం వల్ల మూత్ర విసర్జన పెరుగుతుంది. ఇది మూత్ర మార్గాల ద్వారా విషపదార్థాలను బయటకు పంపుతుంది.

కిడ్నీలు శుభ్రంగా ఉండేందుకు సహాయపడుతుంది. నిమ్మకాయలో పొటాషియం, విటమిన్ C, B విటమిన్లు వంటి పోషకాలు ఉన్నందున, ఇది కిడ్నీ ఫంక్షన్లు మెల్లగా, సాఫీగా జరిగేలా చేస్తుంది. పొటాషియం మాదిరిగా ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ చేయడంలో సహాయపడుతుంది. యూరిన్ తరచూ అసిడిక్ గా ఉండటం వల్ల రాళ్లు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నిమ్మరసం యూరిన్ pH ను నిలపడి, ఆల్కలైన్ మాదిరిగా మార్చి, యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించుతుంది. ఇది గౌట్ ఉన్నవారికి కూడా ఉపయోగకరం. నిమ్మరసం స్వల్ప మోతాదులో డైయూరెటిక్ మాదిరిగా పనిచేస్తుంది. అంటే శరీరంలో నీరు ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది, ఇది మూత్రం రూపంలో బయటకు వెళ్లేలా చేస్తుంది. దీని వల్ల చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు, కిడ్నీ స్ట్రెస్ తగ్గుతాయి.

 ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ½ నిమ్మకాయ రసం కలిపి తాగాలి. కావాలంటే కొద్దిగా తేనె కలిపినా బాగుంటుంది. రోజు 1–2 సార్లు తాగవచ్చు. ఎక్కువ నిమ్మరసం 3–4 నిమ్మకాయలు రోజూ తాగడం మంచిది కాదు – ఎందుకంటే ఇది ఎసిడిటీని కలిగించవచ్చు. గాస్ట్రిక్ లేదా ఎసిడిటీ ఉన్నవారు ఖాళీ కడుపుతో ఎక్కువ నిమ్మరసం తాగకండి. రాత్రి నిద్రకు ముందు తాగడం మంచిదికాదు – ఇది యూరిన్ ఫ్లో పెంచి నిద్రకు అంతరాయం కలిగించవచ్చు. నిమ్మరసం తాగిన వెంటనే నోరు కడగడం మంచిది – పళ్ళపై ఆమ్ల ప్రభావం తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: