కొత్త సంవత్సరం వచ్చేసింది.. క్యాలెండర్లు మారిపోయాయి.. కానీ మీ రొటీన్ లైఫ్ మాత్రం మారలేదా? ఆఫీసు టెన్షన్లు, ఇంటి గోలలు, ట్రాఫిక్ కష్టాలతో విసిగిపోయారా? అయితే ఇప్పుడు మీకు కావాల్సింది ఒక గట్టి బ్రేక్! చలికాలం ముదురుతోంది.. జనవరి నెలలో దక్షిణ భారతదేశం అచ్చం ఒక అందమైన పెళ్లికూతురులా ముస్తాబై ఉంటుంది. ఎండ సెగ లేదు, వాన భయం లేదు.. కేవలం చల్లటి గాలి, మంచు దుప్పటి కప్పిన కొండలు, నీలి రంగు సముద్ర తీరాలు!మరి ఇంకెందుకు ఆలస్యం? బ్యాగ్ సర్దుకోండి.. పెట్రోల్ కొట్టించండి.. జనవరిలో మీరు ఖచ్చితంగా మిస్ అవ్వకూడదు అనిపించే ఆ 10 సౌత్ ఇండియన్ టూరిస్ట్ అడ్డాల గురించి  తెలుసుకుందాం!


1.మున్నార్ (కేరళ):
జనవరిలో మున్నార్ వెళ్తే.. మీరు ఇండియాలో ఉన్నారా లేక స్విట్జర్లాండ్‌లో ఉన్నారా అనే డౌట్ రావడం గ్యారెంటీ! టీ తోటల మీద పడే తెల్లటి మంచు, పొగ మంచును చీల్చుకుంటూ వచ్చే సూర్యకిరణాలు.. అబ్బా! ఆ ఫీలింగే వేరు. ఎరవికుళం నేషనల్ పార్క్, మట్టుపెట్టి డ్యామ్ దగ్గర సెల్ఫీలు దిగితే మీ ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ తగలడిపోవాల్సిందే!

2.ఊటీ (తమిళనాడు):
సౌత్ ఇండియాలో హనీమూన్ అన్నా, ఫ్యామిలీ ట్రిప్ అన్నా గుర్తొచ్చే మొదటి పేరు ఊటీ. జనవరిలో ఊటీ చలి మామూలుగా ఉండదు. నీలగిరి టాయ్ ట్రైన్ ఎక్కి ఆ కొండల మధ్య ప్రయాణిస్తుంటే, మీకు తెలియకుండానే నోటి నుంచి ‘ఆహా’ అనే మాట వచ్చేస్తుంది. బొటానికల్ గార్డెన్స్, దొడ్డబెట్ట శిఖరం మీ కోసం వెయిట్ చేస్తున్నాయి.

3.కూర్గ్ (కర్ణాటక):
కాఫీ వాసన, పచ్చని అడవులు, అబ్బే జలపాతాల గలగలలు.. ఇదే కూర్గ్ మ్యాజిక్! జనవరిలో ఇక్కడ వాతావరణం చాలా రొమాంటిక్‌గా ఉంటుంది. ఇక్కడ ఉండే హోమ్ స్టేలలో ఉంటూ, వేడి వేడి కాఫీ తాగుతూ ఆ ప్రకృతిని చూస్తుంటే.. కోట్లు ఇచ్చినా రాని ప్రశాంతత మీ సొంతమవుతుంది.

4.హంపి (కర్ణాటక):
చరిత్ర అంటే బోర్ అనుకునేవాళ్లు ఒక్కసారి జనవరిలో హంపి వెళ్ళండి. రాళ్లలో ప్రాణం పోసిన ఆ శిల్పాలు, తుంగభద్ర నది తీరం, విరూపాక్ష ఆలయం.. ప్రతి అడుగులోనూ ఒక అద్భుతం కనిపిస్తుంది. ఎండాకాలంలో ఇక్కడ తిరగడం కష్టం, కానీ జనవరి చల్లదనంలో హంపి వీధులన్నీ అలా చుట్టేయొచ్చు.

5.పుదుచ్చేరి:
మీకు ఫారిన్ వెళ్లిన ఫీలింగ్ రావాలా? అయితే పాండిచ్చేరి (పుదుచ్చేరి) వెళ్లండి. ఇక్కడి ఫ్రెంచ్ క్వార్టర్స్, పసుపు రంగు బిల్డింగ్‌లు, బీచ్ రోడ్లు మిమ్మల్ని మరో లోకానికి తీసుకెళ్తాయి. జనవరిలో ఇక్కడ ఆకాశం చాలా క్లియర్‌గా ఉంటుంది. బీచ్ క్యాఫేలో కూర్చుని సముద్రపు గాలిని ఆస్వాదిస్తుంటే వచ్చే కిక్కే వేరు!

6.వాయనాడ్ (కేరళ):
ట్రెక్కింగ్ చేయాలి, అడవి మధ్యలో ఉండాలి అనుకునేవారికి వాయనాడ్ బెస్ట్ ఛాయిస్. ఎడక్కల్ గుహలు, బాణాసుర సాగర్ డ్యామ్ దగ్గర వ్యూస్ మామూలుగా ఉండవు. జనవరిలో ఇక్కడ ఉండే వెదర్ మీ ట్రిప్‌ను లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా చేస్తుంది.

7. మదురై (తమిళనాడు):
దక్షిణ కాశీగా పిలువబడే మదురై మీనాక్షి అమ్మవారి ఆలయం చూడాలంటే రెండు కళ్లు చాలవు. వేల ఏళ్ల నాటి చారిత్రక కట్టడాలు, ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్ చూస్తుంటే మెంటల్ ఎక్కిపోవాల్సిందే. జనవరిలో ఇక్కడ జరిగే ఉత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి.

8. కన్యాకుమారి: మూడు సముద్రాల సంగమ క్షేత్రం!
భారతదేశం చిట్టచివరి పాయింట్! ఒక పక్క బంగాళాఖాతం, మరో పక్క అరేబియా సముద్రం, ఇంకో పక్క హిందూ మహాసముద్రం.. ఇవన్నీ కలిసే చోట నిలబడి సూర్యోదయం చూడటం అనేది ఒక అద్భుతం. జనవరిలో ఇక్కడ సూర్యాస్తమయం చూడటానికి దేశం నలుమూలల నుంచి పర్యాటకులు క్యూ కడతారు.

9. అలప్పుజ (కేరళ):
కేరళ అంటేనే బ్యాక్ వాటర్స్. అలప్పుజలో హౌస్‌బోట్ ఎక్కి, ఆ కాలువల వెంట ప్రయాణిస్తూ, కేరళ స్టైల్ ఫిష్ కర్రీ తింటే.. ఆ ఆనందం వర్ణనాతీతం. జనవరిలో ఇక్కడ వాతావరణం చాలా కూల్‌గా ఉంటుంది, హౌస్‌బోట్‌లో గడపడానికి ఇది మోస్ట్ పర్ఫెక్ట్ టైమ్.

10. వర్కల (కేరళ):
మీకు ప్రశాంతత కావాలా? బీచ్ అంటే ఇష్టమా? అయితే వర్కల వెళ్లండి. ఇక్కడ ఉండే ‘క్లిఫ్’ (కొండ అంచు) నుంచి సముద్రాన్ని చూడటం ఒక క్రేజీ ఎక్స్ పీరియన్స్. జనవరిలో ఇక్కడ జరిగే యోగా క్లాసులు, బీచ్ పార్టీలు పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తాయి.

లైఫ్ అనేది ఒకేసారి వస్తుంది బాస్! దాన్ని కేవలం పనిలోనే కాదు, ఇలాంటి అందమైన ప్రదేశాలను చూడటంలో కూడా గడపాలి. ఈ జనవరిలో మీ గ్యాంగ్‌తో కలిసి ఏదో ఒక ప్లేస్ ఫిక్స్ చేసుకోండి.. వెళ్లి రండి! గుర్తుంచుకోండి.. మీరు పోగొట్టుకున్న డబ్బును సంపాదించుకోవచ్చు కానీ, గడిచిపోయిన కాలాన్ని, ఈ జనవరి చల్లదనాన్ని మళ్లీ తేలేరు!

మరింత సమాచారం తెలుసుకోండి: