గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం...వైసీపీకి కంచుకోట. అయితే వైసీపీ రాకముందు కాంగ్రెస్ హవా ఉండేది. ఇక ఏ పార్టీ అయినా సరే ఇక్కడ పిన్నెల్లి ఫ్యామిలీ డామినేషన్ ఎక్కువ. అందుకే ఇక్కడ టీడీపీకి పెద్ద ఛాన్స్ లేకుండా పోయింది. ఇక్కడ టీడీపీ చివరిగా గెలిచింది 1999 ఎన్నికల్లోనే మళ్ళీ అప్పటినుంచి మాచర్లలో టీడీపీ జెండా ఎగరలేదు. 1983, 1989, 1994, 1999 ఎన్నికల్లో టీడీపీ గెలిచింది.


ఇక 1985, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 2004లో పిన్నెల్లి లక్ష్మారెడ్డి విజయం సాధించగా, 2009లో పిన్నెల్లి ramakrishna REDDY' target='_blank' title='రామకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రామకృష్ణారెడ్డి గెలిచారు. తర్వాత వైఎస్ మరణం, జగన్ కొత్త పార్టీ పెట్టడంతో కాంగ్రెస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ramakrishna REDDY' target='_blank' title='రామకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రామకృష్ణారెడ్డి వైసీపీలోకి వచ్చేశారు. అప్పుడే 2012లో జరిగిన ఉపఎన్నికల్లో రామకృష్ణా వైసీపీ నుంచి నిలబడి అద్భుత విజయం సాధించారు. తర్వాత 2014లో రామకృష్ణ విజయాన్ని అడ్డుకోవడం టీడీపీ వల్ల కాలేదు.


ఇక 2019 ఎన్నికల్లో ఏం జరిగిందో చెప్పాల్సిన పని లేదు. రామకృష్ణ మరోసారి అద్భుత విజయం సాధించి మాచర్లని వైసీపీ కంచుకోటగా మార్చేశారు. అయితే ఆయన ఇన్నిసార్లు వరుసగా గెలవడానికి కారణం, ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండటమే. నియోజకవర్గంలో ఎక్కడ సమస్య ఉంటే పిన్నెల్లి అక్కడ ఉంటారు. పేద, ధనిక వర్గాలు అనే తేడా లేకుండా అందర్నీ కలుపుకుని పోతారు. ఆప్యాయంగా పలకరిస్తారు. పైగా ఇప్పుడు అధికారంలో ఉండటం వల్ల, ప్రజలకు మరింత మెరుగ్గా సేవలు అందిస్తున్నారు. అటు ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించడంలో ముందున్నారు.


ఇక ఇక్కడ టీడీపీకి సరైన నాయకత్వం లేకపోవడంతో, ఆ పార్టీ కేడర్‌ చాలావరకు వైసీపీలోకి వచ్చేసింది. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో మాచర్లలో టీడీపీ నుంచి పోటీ చేసే నాయకుడే లేకుండాపోయాడు. దీంతో మాచర్లలో వైసీపీ క్లీన్‌స్వీప్ చేసింది. ఇక రాబోయే రోజుల్లో కూడా మాచర్లలో టీడీపీకి విజయం దక్కడం కష్టమే అని చెప్పొచ్చు. ఏదేమైనా మాచర్లలో పిన్నెల్లి హవా స్పష్టంగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: