ప్రస్తుతం చాలామంది యువత వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అర్జించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉండడం గమనార్హం. అయితే మీరు కూడా ఏదైనా బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఇప్పుడు చెప్పబోయే బిజినెస్ ఐడియా పాటించినట్లయితే లక్షల్లో లాభాలు వస్తాయి. అదే డ్రాగన్ ఫ్రూట్ సాగు.. పైగా డ్రాగన్ ఫ్రూట్ పండించడం వల్ల లక్షల్లో ఆదాయం కూడా వస్తుంది ఎక్కువగా విదేశాలలోనే ఈ పంటలు పండిస్తున్నారు. కానీ మన భారతదేశంలో కూడా ఈ వ్యవసాయం ఇప్పుడు బాగా విరివిగా విస్తరిస్తోంది. మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో డ్రాగన్ ఫ్రూట్ సాగు విరివిగా జరుగుతోంది.

ఏడాదికి ఏకంగా లక్షల్లో లాభాలను పొందవచ్చు . ఎకరం భూమిలో మీరు ఈ పంటలను వేసినట్లయితే సంపాదన కూడా ఎక్కువగానే ఉంటుంది.  ప్రస్తుతం 400 గ్రాముల వరకు  ఒక్కో డ్రాగన్ ఫ్రూట్ బరువు  ఉంటుంది. ఒక చెట్టుకు సుమారుగా 60 పండ్లు లభిస్తాయి. వీటి కిలో ధర మార్కెట్లో రూ.200 నుంచి రూ.250 వరకు పలుకుతోంది. ఒక డ్రాగన్ ఫ్రూట్ చెట్టు నుండి రూ.5000 వరకు సంపాదించవచ్చు. ఒక ఎకరానికి 17 డ్రాగన్ ఫ్రూట్ చెట్లను నాటవచ్చు. సంవత్సరానికి రూ. 70 లక్షల వరకు ఆదాయం వస్తుంది అని ఇప్పటికే లాభార్జన పొందిన రైతులు కూడా చెబుతున్నారు.


మొదట్లో పంట పెట్టడానికి మాత్రమే ఎక్కువ ఖర్చవుతుంది.  ఆ తర్వాత పెద్దగా మెయింటెనెన్స్ కూడా అవసరం ఉండదు. విరివిగా పండే ఈ పంట ద్వారా డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు.. మీరు మరొక పంటను కూడా పండించుకోవాలనుకుంటే చెట్ల మధ్యలో కూడా ఏదైనా చిన్న చిన్న కూరగాయలను ఏర్పాటు చేసుకోవచ్చు. అప్పుడు రెండు రకాలుగా లాభం లభిస్తుంది.మొత్తానికైతే డ్రాగన్ ఫ్రూట్స్ ద్వారా చాలామంది లక్షణాధికారి అవుతున్నారు.  మీరు కూడా వ్యవసాయం చేయాలి.. బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ప్రభుత్వ సహాయంతో సబ్సిడీ తీసుకొని ఈ పంట మొదలు పెట్టవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: