
ఎల్ఐసి ప్రభుత్వం తరఫున ఒక కొత్త ఎండోమెంట్ పాలసీని ప్రారంభించింది. ఇందులో తక్కువ పెట్టుబడితో పెద్ద రాబడి పొందవచ్చు. రోజు 70 రూపాయల పెట్టుబడి పెట్టడం వల్ల మెచ్యూరిటీ సమయంలో మీ చేతికి రూ. 48 లక్షలు లభిస్తాయి. దీంతోపాటు భీమా రక్షణ, ఇతర పన్ను సంబంధిత ప్రయోజనాలు కూడా పొందవచ్చు. అంతేకాదు ఈ ప్లాన్ తీసుకోవడం వల్ల మీ పిల్లల భవిష్యత్తుకు.. ఆడపిల్లల పెళ్లిళ్ళకే కాదు మరెన్నో అవసరాలకు డబ్బు ఉపయోగపడుతుంది.
ఎల్ఐసి అందిస్తున్న ఈ కొత్త పాలసీ ప్రకారం 8 నుంచి 55 సంవత్సరాల వయసు ఉన్నవారు. ఈ పథకంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పాలసీ వ్యవధి 12 నుంచి 35 సంవత్సరాలు ఉంటుంది. ఇందులో మీరు కనీసం లక్ష రూపాయలు గరిష్టంగా ఎటువంటి పరిమితి లేదు. ఒకవేళ 18 నుంచి 35 సంవత్సరాల వయసు ఉన్న ఒక వ్యక్తి ఈ ప్లాన్ తీసుకున్నట్లయితే ప్రతిరోజు రూ.70 అంటే సంవత్సరానికి 26,534 రూపాయలు పెట్టుబడిగా పెట్టాలి. ఇలా చేయడం వల్ల రూ.10 లక్షల బీమా హామీ లభిస్తుంది . రెండో సంవత్సరంలో ఈ ప్రీమియం రూ.25,962 కి తగ్గుతుంది. ఈ విధంగా మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల రూ.48 లక్షలు చివరిగా మీ చేతికి వస్తాయి.