తాజాగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అందిస్తున్న పాలసీలలో సరికొత్త ప్లాన్స్ వ్యక్తులకు వృద్ధాప్యంలో సహాయపడడానికి ముందుకొస్తున్నాయి. ఇందుకు కారణం ఈ పాలసీలకు వచ్చే రిటర్న్స్ అధికంగా ఉండటమే కాదు.. మంచి ఆర్థిక భరోసా కూడా లభిస్తుంది. ఇక అలాంటి పాలసీలలో ఎల్ఐసి అందిస్తున్న భీమా రత్నా పాలసీ కూడా ఒకటి. ఈ పాలసీలో మెచ్యూరిటీ నాటికి రూ.50 లక్షలు అంటే రూ.అరకోటి మీరు పొందవచ్చు.


ఇది నాన్ పార్టిసిపేటింగ్, నాన్ లింక్డ్ , వ్యక్తిగత, సేవింగ్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అని చెప్పవచ్చు.  ఇందులో భీమారత్న ప్లాన్ తీసుకున్న వారికి సేవింగ్స్ పై కూడా మంచి రిటర్న్స్ రావడంతో పాటు అంతకుమించి బీమా రక్షణ కూడా ఉంటుంది. పాలసీ తీసుకున్న వ్యక్తి ప్రీమియం చెల్లిస్తున్న కాలంలో మరణించినట్లయితే వారి కుటుంబానికి ఆర్థికంగా ఈ పాలసీ అండగా నిలుస్తుంది. ముఖ్యంగా సమ్ అస్యూర్డ్ తో పాలసీ తీసుకున్న సరే మెచ్యూరిటీ సమయానికి 10రెట్ల రిటర్న్స్ మీకు లభిస్తాయి. ఎల్ఐసి భీమారత్న పాలసీని 2002 మే నెలలో ఎల్ఐసి కంపెనీ ప్రకటించింది ఇందులో కనీసం రూ.5 లక్షల సమ్ అష్యూర్డ్ తో పాలసీ తీసుకోవచ్చు..

ఇక ఇందులో గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు.  పాలసీ టర్మ్ మీకు 15, 20 , 25 సంవత్సరాలుగా ఉంటుంది ఒకవేళ 25 సంవత్సరాల ప్లాన్ మీరు ఎంచుకుంటే 21 సంవత్సరాల ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.  అలాగే 20 సంవత్సరాల ప్లాన్ ఎంచుకుంటే అందులో 16 సంవత్సరాల ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. 15 ఏళ్ల పాలసీ టర్మ్ ఎంచుకుంటే.. అందులో 11 సంవత్సరాలు మాత్రమే మీరు ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. ఇకపోతే ఎంచుకున్న సమ్ అసూర్డ్ ను  బట్టి రూ.50 లక్షల వరకు రిటర్న్స్ పొందవచ్చు. ఏది ఏమైనా ఈ పాలసీ ప్రతి ఒక్కరికి అద్భుతమైన లాభాలను అందిస్తుంది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: