రాబోతున్న దసరాను టార్గెట్ చేస్తూ విడుదల కాబోతున్న ‘స్పైడర్’ విజయా అవకాశాల పై మహేష్ కు కూడ కొన్ని అనుమానాలు ఉన్నాయి అన్న ప్రచారం జరుగుతోంది. దీనికితోడు మహేష్ అభిమానులు కూడ ఈసినిమా ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అన్న విషయమై తీవ్ర మధన పడిపోతున్నారు. ఈ పరిస్థుతులలో దర్శకుడు మురగదాస్ ఈమూవీ ప్రమోషన్ గురించి అనుసరిస్తున్న వ్యూహాలు మహేష్ కొత్త తలనొప్పిగా మారాయి అన్న వార్తలు వస్తున్నాయి. 

తెలుస్తున్న సమాచారం మేరకు మురగదాస్ మహేష్ ను కోలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గర చేయడానికి తమిళంలో కమలహాసన్ నిర్వహిస్తున్న ‘బిగ్ బాస్’ షోలో సర్ ప్రైజ్ అతిధిగా తీసుకు రావడానికి వ్యూహాలు రచిస్తున్నట్లు టాక్. అయితే ఇప్పటికే తమినాడులో అనేక వివాదాలకు చిరునామాగా మారిన ఈ ‘బిగ్ బాస్’ షోలో అతిధిగా పాల్గొనడం మహేష్ కు ఏమాత్రం ఇష్టం లేదు అని తెలుస్తోంది.

అయితే మురగదాస్ స్వయంగా రంగంలోకి దిగి మహేష్ పై ఒత్తిడి పెంచుతున్నట్లు గాసిప్పుల హడావిడి చేస్తున్నాయి. ప్రస్తుతం రొమేనియా దేశంలో ఈసినిమాలోని పాట షూటింగ్ నిమిత్తం మహేష్ మురగదాస్ లు బిజీగా ఉన్న నేపధ్యంలో ఆ మూవీ షూటింగ్ ను ముగించుకుని తిరిగి వచ్చేడప్పుడు ఈ ‘బిగ్ బాస్’ షూటింగ్ హడావిడిలో మహేష్ ను ఇన్వాల్వ్ చేయాలని మురగదాస్ చాల గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే బుల్లితెర రియాలిటీ షోలకు చాల దూరంగా ఉండే మహేష్ మురగ దాస్ ఆలోచన విని షాక్ అవుతున్నట్లు సమాచారం. దీనికితోడు ‘స్పైడర్’ మూవీని కోలీవుడ్ మీడియా అదేవిధంగా కోలీవుడ్ ప్రేక్షకులు కేవలం ఒక మురగదాస్ సినిమాగానే గుర్తిస్తున్న నేపధ్యంలో ‘స్పైడర్’ ద్వారా మహేష్ కు కోలీవుడ్ మార్కెట్ లో పెద్దగా కలిసి వచ్చేది లేదు అంటూ కోలీవుడ్ మీడియా వ్రాస్తున్న కామెంట్స్ మహేష్ ను మరింత టెన్షన్ లో పడేస్తున్నట్లు సమాచారం..   


మరింత సమాచారం తెలుసుకోండి: