నిన్న విడుదలైన అడవి శేషు గూఢచారి’ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకావడంతో ఈమూవీ ఏరేంజ్ కలక్షన్స్ ను రాబడుతుంది అన్న విషయమై ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో అంచనాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఈమూవీకి పాజిటివ్ మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ అవ్వడంతో ఈ వీకెండ్ కలక్షన్స్ ను ఈమూవీ బాగా కార్నర్ చేస్తుంది అని అంటున్నారు. 

ఈమూవీతో పోటీగా విడుదలైన ‘చి.ల.సౌ’ ‘బ్రాండ్ బాబు’ కన్నా కలక్షన్స్ విషయంలో ‘గూఢచారి’ దూసుకుపోతూ ఉండటంతో వచ్చే వారాంతానికి ఈమూవీకి 10 కోట్ల గ్రాస్ కలక్షన్స్ వచ్చినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. ఇది ఇలా ఉండగా ‘జేమ్స్ బాండ్’ సినిమాలకు చిరునామాగా ఉండే సూపర్ స్టార్ కృష్ణ వారసత్వం ‘స్పై’ సినిమాల విషయంలో మహేష్ కు ఏమాత్రం కలిసిరాకపోయినా అడవి శేషుకు ‘జేమ్స్ బాండ్’ బ్రాండ్ బాగా కలిసి వచ్చింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.


‘గూఢచారి’ ఇన్ స్పిరేషన్ తోనే మహేష్ కెరీర్ ఆరంభంలో ‘వంశీ’ చిత్రంలో నటించాడు. టామ్ క్రూజ్ మిషన్ ఇంపాజిబుల్ రేంజ్ విన్యాసాలతో మహేష్ మెరిపించినా ఆ సినిమా అప్పట్లో డిజాస్టర్ అయింది. మళ్ళీ జేమ్స్ బాండ్ తరహా కాకపోయినా ‘స్పై’ సినిమాల ప్రయోగం చేయాలని మహేష్ ‘స్పైడర్’ రూపంలో గతసంవత్సరం ప్రయత్నిస్తే ఆసినిమా కూడ ఘోరమైన ఫ్లాప్ గా మారింది. 
Adivi Sesh Goodachari Movie Trailer - Sakshi
మురగదాస్ లాంటి భారీ దర్శకుడు కూడ మహేష్ కు హిట్ ను ఇవ్వలేకపోయాడు. దీనితో ‘స్పై’ తరహాతో కూడిన జేమ్స్ బాండ్ సినిమాలు మహేష్ కు ఏమాత్రం అచ్చిరావు అన్న విషయం మహేష్ కు కూడ తెలియడంతో ‘భరత్ అనే నేను’ సక్సెస్ మీట్ లో మహేష్ ఈవిషయాన్ని ఇన్ డైరెక్ట్ గా చెప్పాడు. దీనితో మహేష్ జేమ్స్ బాండ్ సినిమాలు అంటేనే భయపడిపోతున్నాడు. ఇలాంటి పరిస్థుతులలో జేమ్స్ బాండ్ సినిమాల విషయంలో సూపర్ కృష్ణ వారసత్వం అనుకోకుండా అడివి శేషుకు వచ్చిందా అంటూ కొందరు జోక్ లు వేసుకుంటున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి: