ఆంధ్రప్రదేశ్ లో ఈసారి ఎన్నికల బరిలో సినిమా తారల హడావుడి బాగా పెరిగిపోయింది.  పలు చోట్ల నుంచి సినీ తారలు ముఖ్యమైన పార్టీల తరుపు నుంచి పోటీలో దిగుతున్నారు.  మరికొంత మంది ఇండిపెండెంట్లుగా రంగంలోకి దిగుతున్నారు.  తాజాగా ఇప్పుడు సినీ తార ఏపి ఎన్నికల బరిలో నిలబడింది.  తెలుగులో వచ్చిన బిగ్ బాస్ -2 లో  కామన్ మాన్ కేటగిరిలో అడుగు పెట్టింది సంజన.  తాను బిగ్ బాస్ లో అందరితో సఖ్యతగా ఉంటానని..సాధ్యమైనంత వరకు అందరికీ గట్టి పోటీ ఇస్తానని బిగ్ బాస్ ఇంటిలోకి అడుగు పెట్టింది. 

ట్విస్ట్ ఏంటంటే..మొదటి రోజు సంజనను ఇతర ఇంటి సభ్యులు ఎలిమినేట్ చేయడం..మొదటి వారమే ఆమె ఎలిమేషన్ కావడం జరిగింది.  ఆ సమయంలో బిగ్ బాస్ పై పలు విమర్శలు కూడా చేసింది సంజన.  తాజాగా సంజన ఇప్పుడు రాజకీయాలపై వైపు చూస్తుంది.  ఈ నేపథ్యంలో  నూజివీడు శాసనసభ నియోజకవర్గానికి ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసింది. ఆమె సొంత ఊరు నూజివీడు నియోజకవర్గంలోని ఆగిరిపల్లి మండలంలోని కృష్ణవరం. 

 సంజన హైదరాబాద్‌ సినీపరిశ్రమకు వెళ్లాక జనజాగృతి పార్టీలో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ నూజివీడు అభ్యర్థిగా పోటీచేసేందుకు ప్రయత్నించారు. టికెట్‌ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా నూజివీడు అసెంబ్లీ బరిలో పోటీచేస్తున్నారు.  సంజన  దివంగత మాజీ ఎమ్మెల్సీ, మంత్రి పాలడుగు వెంకట్రావుకు సమీప బంధువు.



మరింత సమాచారం తెలుసుకోండి: