ఒక వైపు తమిళ బిగ్ బాస్-3 అధికారిక ప్రకటన వచ్చేసింది. వచ్చే నెలలో షో కూడా ప్రారంభం అవబోతోందట. ఈ సీజన్ కి కమల్ హాసన్ హోస్ట్ అని సమాచారం. 
తమిళ బిగ్ బాస్ తో పాటు తెలుగు బిగ్ బాస్-3 కూడా ప్రారంభం అవ్వాల్సి ఉన్నా కూడా హోస్ట్ ఎంపిక తో పాటు పార్టిసిపెంట్స్ ఎంపిక విషయంలో గందరగోళ పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఆలస్యం అవుతోందని లేటెస్ట్ న్యూస్. మరి కొన్ని రోజుల్లోనే తెలుగు బిగ్ బాస్-3 ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని.. పార్టిసిపెంట్స్ కూడా ఫైనల్ అయ్యారంటూ కొందరి పేర్లు బయటకు వచ్చాయి. ముఖ్యంగా బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.


బిగ్ బాస్-3 కోసం శ్రీముఖి ఉదయభాను గుత్తా జ్వాలా వరుణ్ సందేశ్ వైవా హర్ష తో పాటుగా జబర్దస్త్ నుండి ఒక కమెడియన్ ను ఎంపిక చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే తన పేరు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న నేపథ్యంలో గుత్తా జ్వాలా స్పందించింది. తాను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లబోతున్నట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని తేల్చి చెప్పేసింది.


అయితే దీనికి సంబంధించిన మరో పుకారు కూడా సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.  బిగ్ బాస్-3 కోసం జ్వాలా ను సంప్రదించిన మాట వాస్తవమే కాని.. ఆమె పారితోషికం మరీ ఎక్కువగా డిమాండ్ చేసిందని.. ఆ కారణంగానే ఆమె స్థానంలో మరెవ్వరినైనా తీసుకోవాలని నిర్వాహకులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.  గుత్తా జ్వాలాను వద్దనుకున్నారంటే ఆమె ఏ స్థాయిలో పారితోషికం డిమాండ్ చేసిందో మరి..! అని కొంతమంది చెప్పుకుంటున్నారట.



మరింత సమాచారం తెలుసుకోండి: