
శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్ సమర్పణలో .. శ్రీ నిహస్ క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో సత్యదేవ్, ఈషా రెబ్బ, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం రాగల 24 గంటల్లో. హీరో శ్రీరామ్ ముఖ్య పాత్రలో నటించారు. శ్రీనివాస్ కానూరు నిర్మాత. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం హైద్రాబాద్ లోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా .. హీరోయిన్ ఈషా రెబ్బ, హీరో శ్రీరామ్, గణేష్ వెంకట్రామన్, నటుడు కృష్ణ భగవాన్ లతో పాటు తదితర చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆవిష్కరించారు అనంతరం.. జరిగిన సమావేశంలో
హీరో సత్యదేవ్ మాట్లాడుతూ .. ఈ టైటిల్ చూస్తుంటే మనకు బాగా తెలిసిందే .. ఎందుకంటే చిన్నప్పటినుండి మనం వాతావరణం గురించి తెలుసుకోవాలంటే వాళ్ళు ఇదే డైలాగ్ చెబుతారు. అదెంత పాపులర్ అన్నది మనకు తెలుసు. ఇప్పుడు అదే క్రేజీ టైటిల్ ని తీసుకుని ఓ ఆసక్తికర కథను శ్రీనివాస్ రెడ్డి గారు అద్భుతంగా తెరకెక్కించాడు. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందన్న నమ్మకం ఉందని అన్నారు.
హీరోయిన్ ఈషా రెబ్బా మాట్లాడుతూ .. ఈ సినిమాలో చాలా మంచి రోల్ చేసాను. నా పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. నటనకు చాలా ఆస్కారం ఉంటుంది. ఇంత మంచి కథలో నన్ను హీరోయిన్ గా ఎంపిక చేసిన దర్శక నిర్మాతలకు థాంక్స్ చెబుతున్నాను. ఈ పాత్రతో నాకు మరింత మంచి గుర్తింపు వస్తుంది అన్నారు.
హీరో శ్రీరామ్ మాట్లాడుతూ .. కామెడీ ఎంటర్ టైనర్ చిత్రాలను బాగా డీల్ చేసే శ్రీనివాస్ రెడ్డి ఈ సారి సరికొత్త తరహాలో ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించాడు. ఇది పూర్తిస్థాయి సీరియస్ సినిమా కాదు .. ఆద్యంతం నవ్వులు పండిస్తూనే .. అందరిలో ఆసక్తి రేపుతోంది. నా పాత్రకు కథలో చాలా కీలకంగా ఉంటుంది. అదేమిటన్నది ఇప్పుడు సస్పెన్స్ అన్నారు.
నిర్మాత కానూరు శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ కథ నన్ను చాలా ఆకర్షించింది. రెగ్యులర్ ఫార్మేట్ తో వస్తున్న చిత్రాలకు బిన్నంగా ఉంటుంది. ప్రతి నిమిషాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. ఇప్పటికే షూటింగ్ పూర్తీ కావొచ్చింది. త్వరలోనే విడుదల డేట్ ప్రకటిస్తాం. శ్రీనివాస్ రెడ్డి తో సినిమా అంటే ఎంత సరదాగా ఉంటుందో అందరికి తెలుసు. అయన మంచి మనిషి. తప్పకుండా ఈ సినిమాతో ఆయనకు మంచి పేరొస్తుంది అన్నారు.
దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ .. రాగల 24 గంటలు అంటే ఏమిటో అందరికి తెలుసు .. మనం వాతావరణం గురించి తెల్సుకోవాలంటే రేడియోల్లో, టీవీల్లో రాగల 24 గంటల్లో అని చెప్పేవారు. అయితే ఈ రాగల 24 గంటల్లో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి అవి ఏమిటన్నదే ఈ సినిమా. ఇప్పటి వరకు కామెడీ, ఎంటర్ టైనర్ చిత్రాలను తెరకెక్కించిన నేను మొదటి సారి థ్రిల్లర్ సినిమా చేస్తున్నాను. అయిన ఇందులో ఫన్ అక్కడ మిస్ అవ్వదు. సత్యదేవ్, ఈషా రెబ్బ చక్కగా చేసారు. ఇక శ్రీ రామ్ మన తెలుగు హీరో అని అందరికి తెలుసు .. అయన ఈ సినిమాలో కీ రోల్ పోషిస్తున్నాడు. ఇక మిగతా పాత్రలు కూడా ఆద్యంతం ఆకట్టుకుంటాయి. షూటింగ్ తో పాటు మిగతా కార్యక్రమాలన్నీ త్వరగా పూర్తీ చేసి చిత్రాన్ని వచ్చే నెలలో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం అన్నారు.
ఈ చిత్రానికి కథ : వై శ్రీనివాస్ వర్మ, మాటలు : కృష్ణ భగవాన్, సంగీతం : రఘు కుంచె, పాటలు : భాస్కర భట్ల, శ్రీ మణి, కెమెరా : అంజి, ఆర్ట్ : చిన్నా, ఎడిటింగ్ : తమ్మిరాజు , యాక్షన్ : విక్కీ మాస్టర్, డాన్స్ : స్వర్ణ మాస్టర్, భాను మాస్టర్ , నిర్మాత : శ్రీనివాస్ కానూరు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : శ్రీనివాస్ రెడ్డి.
మరింత సమాచారం తెలుసుకోండి:
satyadev
shaan
chinna
deva
ganesh venkatraman
geetha
k krishna kumar
prasad nuvvilaa
raju singer
ramu
rathi old
rathi
samar
sangeetha supporting
sangeetha krish
satya
shri
sree mani
srinivas reddy
tara
venkat
venkat producer
shirdi temple
tirumala venkateswara temple
ramanathaswamy temple
somnath and dwarka temple
vaishno devi
jagannath temple
golden temple
kashi vishwanath temple
meenakshi amman temple
dargah sharif