జయంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈశ్వర్ సినిమాతో హీరోగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్, తొలి సినిమాతో మంచి సక్సెస్ నే అందుకున్నారు. ఆ తరువాత ఆయన నటించిన మూడవ సినిమా వర్షం అప్పట్లో అతి పెద్ద విజయాన్ని అందుకుని హీరోగా ప్రభాస్ కు మంచి కమర్షియల్ సక్సెస్ ని అందించింది. అనంతరం రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి, దశరథ్ తీసిన మిస్టర్ పర్ఫెక్ట్, కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన డార్లింగ్, అలానే కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మిర్చి సినిమాలు ఎంతో పెద్ద సక్సెస్ లు సాధించి, హీరోగా ప్రభాస్ కు మంచి క్రేజ్ ని ఫాలోయింగ్ ని తెచ్చిపెట్టాయి.  

వీటి అనంతరం ఆర్కా మీడియా బ్యానర్ పై రాజమౌళి తీసిన బాహుబలి రెండు భాగాలు ఎంతటి గొప్ప విజయాలు అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాటితో ఏకంగా జాతీయస్థాయిలోనే కాక, అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రభాస్ భారీ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ని దక్కించుకున్నారు. ఇక ప్రస్తుతం రాధేశ్యామ్ మూవీలో నటిస్తున్న ప్రభాస్, దాని అనంతరం నాగ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ సంస్థ నిర్మించనున్న సినిమాతో పాటు, బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో ఎంతో భారీగా తెరకెక్కనున్న ఆదిపురుష్ సినిమాలో కూడా నటించనున్నారు.  

వాస్తవానికి మిర్చి సమయంలో ప్రభాస్ తీసుకున్న పారితోషికం రూ. 15 కోట్లు మాత్రమే అని, ఇక ప్రస్తుతం ఆయన రాధేశ్యామ్ కు రూ. 85 కోట్లవరకు తీసుకుంటున్నారని, అలానే నాగ అశ్విన్ సినిమాతో పాటు ఆదిపురుష్ సినిమాలకు ఆయన రెమ్యునరేషన్ రూ. 100 కోట్లకు చేరిందనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. ఇక రేపు ఈ మూడు సినిమాలు రిలీజ్ అయి మంచి సక్సెస్ సాధిస్తే అమాంతం ఆయన క్రేజ్ తో పాటు పారితోషికం కూడా పెరిగే ఛాన్స్ ఉందని, ఈ విధంగా పదిహేను కోట్ల నుండి వందకోట్ల వరకు అందరూ శభాష్ అనేలా ప్రభాస్ తన క్రేజ్ తో పాటు రెమ్యునరేష్ ని కూడా ప్రభాస్ పెను ప్రభంజనం సృష్టించారని అంటున్నారు విశ్లేషకులు ....!!   

మరింత సమాచారం తెలుసుకోండి: