
సోషల్ మీడియాలో, వెండితెరపై ఐటెం బాంబ్‌గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. అయితే తన ప్రత్యేకమైన ప్రైవేట్ యాప్‌లో పూనమ్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. హాట్ హాట్ వీడియోలతో ఫ్యాన్స్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. పూర్తి వీడియోలు చూడాలంటే డబ్బులు చెల్లించాలంటూ కండీషన్లు కూడా పెడుతుంది ఈ అమ్మడు. అలా పూనమ్ సోషల్ మీడియాలో సెగలు రేపుతూ ఉంటుంది.ఈ మధ్యే పూనమ్ తన బాయ్ ఫ్రెండ్ సామ్ బాంబేను వివాహం చేసుకున్న విషయం యన్.టి తెలిసిందే. అయితే ఆ పెళ్లి కాస్తా మూన్నాళ్ల ముచ్చటగానే ముగిసింది.
సామ్ బాంబేను వివాహం చేసుకుని హనీమూన్‌కు వెళ్లింది పూనమ్ పాండే. అయితే అక్కడ పూనమ్ చేసిన రచ్చ ఓ రేంజ్‌లో హల్చల్ చేసింది.అక్కడ ఏదో గొడవ జరగడంతో భర్తపైనే కేసు పెట్టింది. ఆ తర్వాత అతడు అరెస్ట్ అవడం, బయటకు రావడం కూడా జరిగిపోయింది. అలా వీరి బంధానికి ముగింపు పడింది..తాజాగా పూనమ్ పాండేపై గోవాలో ఓ కేసు నమోదైంది. గోవాలో అసభ్యకరమైన షూటింగ్‌లు చేస్తున్నారని పలు వార్తలు రావడంతో గోవా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వీడియోలు, ఆ షూటింగ్‌లు హద్దులు దాటినట్టు ఉండటంతో పూనమ్‌పై గోవా మహిళా విభాగం సైతం కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది.