సినీ ఇండస్ట్రీలో జయాపజయాలు సర్వసాధారణం. అది హీరోహీరోయిన్ల అయినా కావచ్చు లేదా దర్శకనిర్మాతలకు అయినా కావచ్చు. ఒక సినిమా భారీ విజయాన్ని సాధించింది అంటే వారికి మరొక సినిమా తీయడానికి అవకాశాలు ఎక్కువగా వస్తాయి. అదే సినిమా డిజాస్టర్ అయితే వారికి అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. అలా సినీ ఇండస్ట్రీలో కొంత మంది దర్శకులు, వారు దర్శకత్వం వహించిన సినిమాలు భారీగా ప్లాప్ అవడంతో వారు మరొక సినిమా తీయడానికి అవకాశాలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.అలా ఎంత మంది దర్శకులు వారి వారి జీవితాల్లో సినిమాల కారణంగా ఎదురుదెబ్బలు తిన్నారో ఇప్పుడు చూద్దాం.

కరుణాకరణ్  దర్శకత్వంలో రామ్ హీరోగా వచ్చిన సినిమా "ఎందుకంటే ప్రేమంట". ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో కరుణాకరణ్  కెరియర్ పై భారీగా దెబ్బ కొట్టిందని  చెప్పవచ్చు.

గోపీచంద్ నటించిన "వాంటెడ్" చిత్రం ద్వారా  సినీ ఇండస్ట్రీకి పరిచయమైన కొత్త డైరెక్టర్  బి.వి.ఎస్.రవి. రవి "జవాన్ " సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫ్లాప్ అవడంతో కొద్దిరోజుల పాటు అవకాశాలను కోల్పోయాడు.

నాగార్జున, నయనతార కాంబినేషన్లో వచ్చిన "గ్రీకువీరుడు" సినిమాకు దశరథ్ డైరెక్టర్గా వహించారు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద డిజాస్టర్గా నిలవడంతో దశరథ్ కెరియర్లో మరో సినిమాకి అవకాశం రాలేదు.

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన "లవర్" చిత్రానికి క్రాంతిమాధవ్ దర్శకత్వం వహించారు. ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి చిత్రాలను అద్భుతంగా తెరకెక్కించిన మాధవి లవర్ సినిమా తర్వాత అవకాశాలు కోల్పోయాడు.

ఎన్టీఆర్ నటించిన "శక్తి" సినిమాకు దర్శకత్వం వహించిన మెహర్ రమేష్. ఈ సినిమా డిజాస్టర్ గా నిలవడంతో మెహర్ రమేష్ జీవితంపై భారీ దెబ్బ పడింది.

శతమానం భవతి వంటి కుటుంబ చిత్రం ద్వారా మంచి విజయాన్ని సాధించిన సతీష్ వేగ్నేష్, అదే తరహాలో మరొక సినిమా చేయాలని అనుకొని నితిన్ తో కలిసి శ్రీనివాస కళ్యాణం సినిమాలు తీశారు. రెండు ఒకే తరహా సినిమాలు కావడంతో శ్రీనివాస కళ్యాణం పెద్దగా హిట్ కాలేకపోయింది. దీంతో సతీష్ వేగ్నేష్ తన కెరియర్ లో కొంచెం ఇబ్బంది కలిగింది అని చెప్పవచ్చు.వీరే కాకుండా శ్రీను వైట్ల, శ్రీకాంత్ అడ్డాల, వివి వినాయక్, బోయపాటి శీనులాంటి ఎంతో మంది స్టార్ డైరెక్టర్లు ప్లాప్ మూవీస్ కి దర్శకత్వం వహించి కెరియర్ లో భారీగా దెబ్బతిన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: