ఇంతకీ విషయం ఏమిటంటే ! మన తెలుగు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ ఉండటం మామూలే. అయితే సంక్రాంతి బరిలో ఉన్న మూడు సినిమాల్లోనూ ఐటమ్ సాంగ్స్ ఉన్నాయి. ఆశ్చర్యం ఏమిటంటే ఈ మూడు సినిమాల్లోనూ ఐటమ్ సాంగ్స్ ప్రేక్షకులను థియేటర్లలో ఉర్రూతలూగించాయి.
"క్రాక్ " మూవీలో మాస్ మహారాజ్ రవితేజ ,అప్సర రాణి కలిసి చిందేసిన ఐటమ్ సాంగ్ ప్రేక్షకులను మెప్పించి, రవితేజ స్టెప్స్ , అప్సర రాణి గ్రామర్ ప్రేక్షకులను మైమరిపించారు.
ఎనర్జిటిక్ హీరో రామ్ తో , గ్లామర్ హీరోయిన్ హెబ్బా పటేల్ ఆడిపాడిన స్పెషల్ సాంగ్ సినిమా ధియేటర్లో కేరింతల వర్షం కురిపించింది హెబ్బా పటేల్ తన అందంతో కుర్రకారుని ఆకట్టుకోగలిగింది.
బిగ్ బాస్ సీజన్ 4 బ్యూటీ మోనాల్ గజ్జర్.( రంభ ఊర్వశి మేనక అందర్నీ కలిపితే నేనిక అంటూ .). అనే ఐటమ్ సాంగ్ లో అద్భుతంగా నటించి ప్రేక్షకుల మనసు కొల్లగొట్టింది.
ఏదేమైనప్పటికీ సినిమా విజయం తో సంబంధం లేకుండా ఈ మూడు సినిమాల్లో వచ్చిన ఐటమ్ సాంగ్స్ కుర్రకారుని సంక్రాంతి సంబరాలతో ఉర్రూతలూగించాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.