
సినిమాల సంగతి పక్కన పెడితే బాలీవడ్ క్వీన్ కంగనా రనౌత్ కి ఫోటో కాపీ లా ఉంటుంది తాప్సి.. మనసులో ఏమున్నా భయం లేకుండా చెప్తుంది.. ఎంతటి వాడినైనా వేలెత్తి చూపుతుంది.ఇప్పటికే ఆమె టాలీవుడ్ పై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.. సినీ పరిశ్రమలో నెపోటిజం, మీటూ విషయాలపై తన అభిప్రాయాలను వెల్లడించడంలో ముందు వెనుక ఆలోచించదు..
ఈ నేపథ్యంలో ఆమె ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో తన వ్యక్తిగత జీవితం, అఫైర్ గురించి క్లారిటీ ఇచ్చింది. బాలీవుడ్, దక్షిణాది చిత్ర పరిశ్రమలో రాణిస్తున్న తాప్సీ సినీ ప్రముఖులతో అఫైర్లు, డేటింగ్ గురించి రకరకాల రూమర్లు వినిపించాయి. అయితే వాటికి భిన్నంగా డెన్మార్క్‌కు చెందిన షట్లర్ మాతియాస్ బోయ్ ప్రేమలో పడటం ఆశ్చర్యానికి గురి చేసింది. బోయ్ చాలా ఏళ్లుగా తాప్సీతో డేటింగ్ చేస్తూ రిలేషన్‌షిప్‌లో ఉన్నాను అని చెప్పారు.. నాకు మొదటి నుంచి సినీ ఇండస్ట్రీ వారితో రిలేషన్‌షిప్, డేటింగ్ చేయడం ఇష్టం లేదు. నా పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ వేర్వేరుగా ఉండాలని కోరుకొన్నాను. అందుకే విభిన్నమైన రంగానికి చెందిన మాతియాస్‌తో ప్రేమలో పడ్డాను.అతడితో అన్నీ మాట్లాడుకోవడాలు అయిపోయాయి.. ఇక పెళ్లి చేసుకోవడమే తరువాయి.. అతడు నా అంతర్గత జీవితంలో కీలకంగా మారారు అని వెల్లడించారు.