వచ్చే వారం విడుదల కాబోతున్న ‘ఉప్పెన’ ప్రమోషన్ భారీ స్థాయిలో చేయబోతున్నారు. అతి త్వరలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ చాలా గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. చిరంజీవి ముఖ్య అతిధిగా పాల్గొనే ఈ ఫంక్షన్ కు చాలమంది మెగా హీరోలు రాబోతున్నారు అన్న సంకేతాలు వస్తున్నాయి.


‘బాహుబలి’ సినిమాలో ప్రభాస్ శివలింగం భుజం పై పెట్టుకిని వస్తున్నప్పుడు వచ్చే పవర్ ఫుల్ సాంగ్ లాంటి ఒక పాట శివ తత్వం పై ‘ఉప్పెన’ లో ఉంటుంది అన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈపాట ‘ఖలేజా’ సినిమాలో ‘సదా శివా సన్యాసి' అంటూ రామజోగయ్య శాస్త్రి వ్రాసిన పాట  రేంజ్ లో ఉంటుందని వార్తలు వస్తున్నాయి.


ఈమధ్య కాలంలో సినిమాలలో శివుడు పై పాటలు పెట్టలేదు. ఇప్పుడు ఆ పాట లోటును ‘ఉప్పెన’ లోని పాట తీరుస్తుంది అని అంటున్నారు. శివయ్య లీలను ఆధారంగా చేసుకుని చంద్రబోసు రాసిన  పవర్ ఫుల్ తత్వగీతం’ఉప్పెన’ లో ఉందట. ఈ పాట ఈ సినిమాలో మాంటేజ్ సాంగ్ గా వస్తుంది అని తెలుస్తోంది. దేవీశ్రీ ప్రసాద్ దీనికి మాంచి ట్యూన్ కట్టాడని టాక్. ఈపాటను ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ రోజున విడుదల చేస్తారని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదల అయిన పాటలు అన్నీ సూపర్ హిట్ అవ్వడంతో ఈమూవీ బ్లాక్ బష్టర్ హిట్ అన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాను చూసిన చిరంజీవి ఈమూవీ దర్శకుడుని అభినందిస్తూ భారతీయ రాజా టేకింగ్ తనకు ఈ మూవీలో కనిపించింది అని కామెంట్ చేసినట్లు టాక్. సాధారణంగా సినిమాల విషయంలో చిరంజీవి జడ్జిమెంట్ తప్పదు అని అంటారు. ఇప్పుడు ఈమూవీని చూసి చిరంజీవి చేసిన కామెంట్స్ బయటకు రావడంతో సంక్రాంతి సీజన్ తరువాత విడుదల అయిన సినిమాలలో ‘ఉప్పెన’ బ్లాక్ బష్టర్ హిట్ తో రికార్డులు క్రియేట్ చేస్తుందా అన్న అంచనాలు వస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: