తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు సగటు ప్రేక్షకుడిని అలరించేలా ఉంటాయి. ఇండస్ట్రీలో కృష్ణ గారు అంటేనే డేరింగ్ అండ్ డాషింగ్ గా ఉంటారని చాలా మంది చెబుతుంటారు.

ఆయనతో పాటు సినిమాల్లో నటించిన నటి విజయనిర్మల గారిని ఆయన పెళ్లి చేసుకున్నారు. ఆవిడ కృష్ణ గారిని హీరో గా పెట్టి చాలా సినిమాలు డైరెక్ట్ చేసింది. ప్రముఖ రచయిత్రి అయిన యద్దనపూడి సులోచనారాణి నవల ఆధారంగా తీసిన మీనా సినిమాతో దర్శకురాలిగా పరిచయమయ్యారు అప్పటి నుండి కృష్ణ గారి చాలా సినిమాలకు డైరెక్టర్ గా వ్యవహరించారు.

అలాగే ఇండస్ట్రీలో ఎవరూ టచ్ చేయని జోనర్ లలో సినిమాలు తీసి విజయాలు సాధించారు.ఇదిలా ఉంటే కృష్ణ గారి డేరింగ్ అండ్ డాషింగ్ గా ఉండే తత్వానికి ఉదాహరణగా ఒక విషయాన్ని చెప్పవచ్చు అదేంటంటే అప్పట్లో ప్రత్యేక ఆంధ్ర కోసం ఉద్యమం సాగింది అందులో రాయలసీమ, కోస్తా ప్రాంతాల ప్రజలందరూ రోడ్ల పైకి వచ్చి ధర్నాలు చేయడంతో తెలుగు వాళ్లకు మద్దతుగా కృష్ణ గారు విజయనిర్మల గారు కూడ వచ్చి మద్రాస్ నడిబొడ్డు మీద ఒక రోజు నిరాహార దీక్ష చేశారు అప్పట్లో ఇండస్ట్రీ మొత్తం మద్రాసు లోనే ఉండేదిఅందుకే అక్కడే కృష్ణ గారు నిరాహార దీక్ష చేసి తెలుగు వాళ్ళ పట్ల అతనికున్న గౌరవాన్ని చాటుకున్నారు అతనితో పాటు నిరాహార దీక్షలో విజయనిర్మల గారు కూడా కూర్చున్నారు.

ఏదేమైనా అప్పట్లో ఉన్న అగ్ర హీరోలందరి లో  సినిమాకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలి అన్న సమాజానికి సంబంధించిన విషయాల్లో జనాలకి మద్దతుగా ఉండాలన్న ఏమి ఆలోచించకుండా కృష్ణ గారు ముందుండి అన్ని కార్యక్రమాలు నడిపించేవారు. అందుకే అప్పట్లో కృష్ణ గారి గురించి చాలా మంది చెబుతూ ఆయన హీరో గానే కాదు మంచి మనసు ఉన్న మనిషి అని కూడా అంటుండేవారు......

మరింత సమాచారం తెలుసుకోండి: