
ఈ సినిమా తర్వాత ఆమె పూర్తి గా బాలీవుడ్ కి వెళ్ళిపోయింది.. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఎన్టీఆర్ తో రెండు సినిమాలు చేయడంతో ఆమె కు, ఎన్టీఆర్ కు ఎఫైర్ ఉందనే వార్త తెగ ప్రచారం అయ్యింది.. ఇద్దరికీ ఎఫైర్ ఉందొ లేదో తెలీదు కానీ ఈ ఎఫైర్ ద్వారా సమీరా కి ఆఫర్ లు మాత్రం రాలేదు. తెలుగులో ఆమెకు అశోక్ సినిమా లాస్ట్ సినిమా అంటే ఆమె ఎంతగా దీని వళ్ళ డిస్టర్బ్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ విషయంలో నిజం ఏమిటో ఎవరికీ తెలియదు. ఆ తరువాత ఎన్టీఆర్, సమీరా తమ తమ కెరీర్స్ లో బిజీ అయ్యారు. 2011లో ఎన్టీఆర్ వివాహం చేసుకోగా.. 2014లో సమీరా వివాహం చేసుకున్నారు.
ఇక మళ్ళీ ఇన్నాళ్లకు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది సమీరా రెడ్డి.. టీనేజ్ లో ఉన్నప్పుడు సమీరా అనేక అవమానాలు ఎదుర్కొన్నారట. తన వెయిట్ కారణంగా ఆమె ఫ్రెండ్స్ తో పాటు కొందరు అవమానానికి గురి చేశారట. టీనేజ్ లో ఉన్న ఫోటో పంచుకున్న సమీరా రెడ్డి, ఇప్పటి నుండే తన పిల్లలు ఇతరుల పట్ల అలాంటి కామెంట్స్ చేయకుండా జాగ్రత్త పడుతున్నారట.పిల్లలకు మన తోటి వారు లావుగా, లేదా సన్నగా ఉన్నారని హేళన చేయకూడని నేర్పుతున్నారట. టీనేజ్ లో తాను ఎలా ఉందో ఆ ఫోటో పంచుకున్న సమీరా... ఇలా కామెంట్ చేశారు.