తెలుగు సినీ రంగానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ద‌ర్శ‌కుల్లో శ‌తాధిక చిత్రాల ద‌ర్శ‌కుడు కోవెల‌మూడి రాఘ‌వేంద్ర‌రావు ఒక‌రు. ఆయ‌న తీసే ప్ర‌తీసినిమా ప్రేక్ష‌కుల గుండెల‌ను తాకుతుంది. న‌వ‌ర‌సాల‌ను ఒకే చిత్రంలో పొందుప‌ర్చి ఓ మంచి సినిమా చూశామ‌న్న భావ‌న‌ను క‌ల్పించ‌డంలో రాఘ‌వేంద్ర‌రావు దిట్ట‌. 1942 మే23న కృష్ణా జిల్లా కంకిపాడు మండ‌లానికి చెందిన కోల‌వెన్ను గ్రామంలో జ‌న్మించాడు. రాఘవేంద్రరావు తండ్రి కోవెలమూడి ప్రకాశరావు కూడా దర్శకుడే. రాఘ‌వేంద్ర‌రావు దర్శకుడిగా మొదటి చిత్రం 1975లో వచ్చిన బాబు. ఈ చిత్రంలో శోభన్ బాబు, వాణిశ్రీ, లక్ష్మి ముఖ్య పాత్రల్లో నటించారు. ఆ తర్వాత ఎంతో మంది కథానాయకులతో ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీశాడు.

రాఘ‌వేంద్ర‌రావు తీసిన సినిమాల్లో అద్భుత‌మైన సినిమాలు అనేకం ఉన్నాయి. స్త్రీ పాత్రలే ప్రధానంగా జ్యోతి, ఆమె కథ, కల్పన లాంటి చిత్రాలు తీశాడు. అన్నమయ్య, శ్రీ మంజునాథ, శ్రీరామదాసు, శిరిడి సాయి, ఓం నమో వేంకటేశాయ లాంటి ఆధ్యాత్మిక చిత్రాలు రూపొందించాడు. అయితే ఓ త‌మిళ రీమేక్ సినిమాను ప‌ద‌హారేళ్ల వ‌య‌స్సు పేరుతో తెలుగులో అద్భుతంగా తెర‌కెక్కించారు రాఘ‌వేంద్ర‌రావు. త‌మిళంలో క‌మ‌ల్‌హాస‌న్‌, ర‌జ‌నీకాంత్‌, శ్రీ‌దేవితో భార‌తీరాజా ఈ సినిమాను తీశారు. ఆ సినిమా సిల్వ‌ర్‌జూబ్లీ ఆడింది. తెలుగులో రీమేక్ చేసే అవ‌కాశం రాఘ‌వేంద్ర‌రావుకు వ‌చ్చింది. దీంతో పదహారేళ్ల వ‌య‌స్సు అనే టైటిల్‌తో చంద్ర మోహన్, శ్రీదేవి, మోహన్ బాబుల‌తో తెర‌కెక్కించారు రాఘ‌వేంద్ర‌రావు.

త‌మిళంలో వ‌చ్చిన సినిమాలో క్లైమాక్స్ సీన్స్ రాఘ‌వేంద్ర‌రావుకు న‌చ్చ‌లేద‌ట‌. సినిమాలో ఓ ప‌ల్లెటూరులో ప‌ద‌హారేళ్ల అమ్మాయి  అవిటి వ్య‌క్తిని పెళ్లిచేసుకుంటుంది. ఇదే స‌మ‌యంలో ప‌ట్నం నుంచి వ‌చ్చిన వ్య‌క్తితో ప్రేమ‌లో ప‌డుతుంది. త‌రువాత ఇది త‌ప్పుఅని తెలుసుకొని అత‌డి నుంచి దూరంగా ఉంటుంది. కానీ ప‌ట్నం నుంచి వ‌చ్చిన వ్య‌క్తి  ఆ మ‌హిళ‌ను బ‌ల‌వంతం చేయ‌బోతాడు.. ఈ దృశ్యాన్ని చూసిన ఆమె భ‌ర్త ప‌ట్నం వ్య‌క్తిని చంపేసి  జైలుకెళ్తాడు. క్లైమాక్స్‌లో జైలుకెళ్లిన భ‌ర్త‌కోసం భార్య ఎదురుచూస్తుంది. కానీ వ‌స్తాడా రాడా అన్న విష‌యాన్ని చూపించ‌కుండానే సినిమా ఎండ్ అవుతుంది. రాఘ‌వేంద్ర‌రావుకు క్లైమాక్స్ న‌చ్చ‌పోవ‌టంతో తెలుగులో మార్చేశాడు. క్లైమాక్స్‌లో భ‌ర్త‌కోసం ఎదురుచూస్తున్న భార్య‌కు సంతోషాన్ని క‌లిగించేలా జైలు నుంచి భ‌ర్త రావ‌డం, వారిద్ద‌రు క‌లిసిపోవ‌టంతో సినిమా ఎడ్ అవుతుంది.

ఈ విష‌యాన్ని తెలుసుకున్న క‌మ‌ల్‌హాస‌న్‌, ర‌జ‌నీకాంత్‌లు రాఘ‌వేంద్ర‌రావు ఇంటికి వ‌చ్చార‌ట‌. క్లైమాక్స్ త‌మిళ సినిమాలో ఉన్న‌ట్లుగా ఉంచాల‌ని వాదులాడారట‌. కానీ రాఘ‌వేంద్ర‌రావు వారికి న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నం చేసినా ఉప‌యోగం లేకుండా పోయింద‌ట‌. ఖ‌చ్చితంగా క్లైమాక్స్ త‌మిళంలో ఉన్న‌ట్లే ఉండాల‌ని క‌మ‌ల్‌, ర‌జ‌నీలు ప‌ట్టుబ‌ట్టార‌ట‌. దీంతో రాఘ‌వేంద్ర‌రావు ఓ నిర్ణ‌యానికి వ‌చ్చి.. సినిమాను తాను తీసిన విధంగా విడుద‌ల చేస్తాన‌ని, ప్రేక్ష‌కుల నుంచి రెస్పాన్స్ లేకుంటే మార్చేసి త‌మిళంలోలా యాడ్ చేద్దామ‌ని చెప్పార‌ట‌. దీంతో క‌మ‌ల్‌, ర‌జ‌నీలు వెళ్లిపోయార‌ని రాఘ‌వేంద్ర‌రావు ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు. అయితే ఈ సినిమా తెలుగులో సిల్వ‌ర్ జూబ్లీ ఆడింది. క్లైమాక్స్ మాత్రం తాను తీసిన‌ట్లుగానే ఉంచారు. రాఘేవేంద్ర‌రావు.

మరింత సమాచారం తెలుసుకోండి: