తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం సంగీత దర్శకుడిగా మంచి పేరు ప్రఖ్యాతలతో కొనసాగుతున్నారు థమన్. భీభత్సం సినిమాతో మొదలైన థమన్ కెరీర్, ఆ తరువాత కిక్, దూకుడు, బృందావనం వంటి సినిమాల సూపర్ సక్సెస్ తో బాగా పుంజుకుంది. ఇక అక్కడి నుండి వరుస ఛాన్స్ లతో కొనసాగిన థమన్ ఇటీవల మరింతగా విజయాలు తన ఖాతాలో వేసుకుంటూ ఆడియన్స్ ని సూపర్ సాంగ్స్ తో ఉర్రూతలూగిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం ఎన్టీఆర్ తో బృందావనం, అల్లు అర్జున్ తో అలవైకుంఠపురములో సినిమాలకు పని చేసి ఆయా సినిమాలకు అద్భుతమైన సాంగ్స్ అందించిన తమన్, అల మూవీ సాంగ్స్ తో ఏకంగా జాతీయ స్థాయిలో గొప్ప పేరు దక్కించుకున్నారు.
ఇక ఆ మూవీ సాంగ్స్ యూట్యూబ్ తో పాటు పలు ఇతర మ్యూజికల్ మీడియాల్లో కూడా వందల మిలియన్ల వ్యూస్ అందుకోవడం విశేషం. అసలు విషయం ఏమిటంటే తెలుగు సినిమా పరిశ్రమలో దాదాపుగా అందరు స్టార్ హీరోల సినిమాలకు పని చేసిన థమన్, కేవలం ప్రభాస్ తో మాత్రం ఇప్పటివరకు ఒక్క మూవీ కూడా చేయలేదు. కొన్నాళ్ల క్రితం ప్రభాస్ తో లారెన్స్ తీసిన రెబల్ సినిమాకు థమన్ సంగీతం అందించనున్నారు అంటూ అప్పట్లో వార్తలు వచ్చినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు.

ఇక ఇటీవల సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ యాక్ట్ చేసిన సాహో మూవీ కి అయితే మొదట థమన్ పేరు బాగా ప్రచారం అయింది, అలానే ఆ మూవీకి అద్భుతమైన సాంగ్స్ అందిస్తాను అంటూ అంతకముందు జరిగిన పలు మీడియా సమావేశాల్లో థమన్ మాట్లాడుతూ చెప్పారు  అయితే మధ్యలో ఏమి జరిగిందో ఏమో తెలియదు గాని, జీబ్రాన్ బీజీఎమ్ అందించిన ఆ మూవీ కి పలువురు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ పని చేయడం జరిగింది. ఆ విధంగా ప్రభాస్ తో రెండు సార్లు పని చేసే ఛాన్స్ థమన్ కు వచ్చినట్లే వచ్చి చేజారడంతో ఎప్పుడు తమ హీరోతో సినిమా చేస్తావు అన్నా అంటూ థమన్ ని ఉద్దేశించి పలువురు ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంతకీ ఈ ఇద్దరి కాంబో ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి ..... !!

మరింత సమాచారం తెలుసుకోండి: