ఈ నటుడి కైనా, ఏ సాంకేతిక నిపుణుడికైనా బాగా చేశావ్ అన్న ప్రశంస ఎన్నో గొప్ప చిత్రాలకు, మరెన్నో గొప్ప రికార్డులకు పునాది వేస్తుంది. అలా రాష్ట్ర ప్రభుత్వాలు, దేశ ప్రభుత్వాలు సినిమా ఇండస్ట్రీలో రాణించే వారికి అవార్డులు రివార్డులు ఇచ్చి వారిని ప్రోత్సహించడం అనాధి కాలంగా చేస్తోంది. ఇలాంటి అవార్డులు ఒక్కసారి అందుకుంటే చాలు అనుకునే నటులు చాలామందే ఉన్నారు కానీ వారు చేసే అద్భుతమైన ప్రదర్శనకు గాను పలుమార్లు అవార్డులు అందుకున్నారు మన నటులు. ఆ విధంగా ప్రపంచంలోనే బెస్ట్ అవార్డు ప్రధాన సంస్థగా ఉన్న ఫిలింఫేర్ అవార్డును ఎక్కువగా అందుకున్న తెలుగు హీరోల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ విభాగంలో మెగాస్టార్ చిరంజీవి ఎక్కువగా ఏడుసార్లు ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. 1982 లో మెగాస్టార్ చిరంజీవి శుభలేఖ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డును అందుకోగా,విజేత, ఆపద్బాంధవుడు, ముఠామేస్త్రి, స్నేహం కోసం, ఇంద్ర, శంకర్ దాదా ఎంబిబిఎస్ వంటి చిత్రాలకు గాను ఆయన ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత ఎక్కువ ఫిలింఫేర్ అవార్డును అందుకున్న హీరో మహేష్ బాబు. ఒక్కడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలలో ఆయన అద్భుతమైన ప్రదర్శనకు గాను ఫిలింఫేర్ అవార్డు దక్కింది.

శోభన్ బాబు మరియు వెంకటేష్ ఇరువురికి నాలుగేసి సార్లు ఈ అవార్డు వరించింది. అల్లు అర్జున్, కమలహాసన్, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణంరాజు వంటి టాలీవుడ్ హీరోలకు మూడుసార్లు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజాశేఖర్ లకు రెండుసార్లు,  పవన్ కళ్యాణ్, సోమయాజులు, విజయ్ దేవరకొండ, ఉదయ్ కిరణ్, సిద్ధార్థ, చంద్ర మోహన్ లకు ఒక్కసారి ఫిల్మ్ ఫేర్ అవార్డు ను అందుకున్నారు. ఏదేమైనా ఒక పని చేస్తే దానికి మంచి  ప్రశంస దక్కితే ఆ ఆనందమే వేరు..

మరింత సమాచారం తెలుసుకోండి: