నాని తన మొదటి సినిమా నుంచి కూడా ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యతని చూపిస్తాడు. అలా ఆయన కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా నిన్ను కోరి.పెళ్లి తర్వాత కూడా తన ప్రేమని పొందడానికి నాని చేసే ప్రయత్నమే ఈ సినిమా కథ. ఇందులో నాని కి జోడిగా నివేత తమోస్ అలాగే ఇంకొక ముఖ్యమైన పాత్రలో అది పినిశెట్టి కనిపించారు.

తెలుగులో వచ్చిన డిఫరెంట్ లవ్ స్టోరీస్ లో ఇది ఒకటి.ఇక ఈ సినిమాలో పాటల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అన్ని పాటలు కూడా సినిమా రిలీజ్ అయినప్పుడు చాట్ బస్టర్స్ అయ్యాయి.ముఖ్యంగా "ఉన్నట్టుండి గుండే" , "ఏ బదులు చెప్పవే " లాంటి పాటలు మంచి ప్రజాదరణ పొందాయి. మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ మలయాళం వాడు అయినప్పటికీ తెలుగు భాషని అర్థం చేసుకొని ట్యూన్స్ ఇచ్చారు.

ఇక ఈ సినిమా నాని కెరీర్ లో ఎప్పుటికీ గుర్తుండిపోతుంది. ఇక డైరెక్టర్ శివ నిర్వాణకి ఇది మొదటి సినిమా అయినప్పటికీ ఎక్కడ మనకు అలా అనిపించదు. అలాగే ఈ సినిమాకి కోన వెంకట్ మాటలు కూడా ఇంకో హైలైట్.ఈ సినిమా కథ శివ నిర్వాణ మొదటి సారి నాని కి చెప్పినప్పుడు ఆయన వెంటనే ఒప్పుకున్నారట.ఈ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది అని ఆయన చెప్పారట.ఈ సినిమాని తమిళంలోకి తల్లిపోగాదె అనే పేరుతో రీమేక్ చేశారు. ఇందులో ఆత్రేవా ,అనుపమ పరిమేశ్వరన్ కలిసి నటించారు.ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాన్ని అందుకుంది. 18 కోట్లతో నిర్మించిన ఈ సినిమా పూర్తి కలెక్షన్స్ 28 కోట్ల కి పైగా సంపాదించింది.జులై 7 2017న విడుదలైన ఈ సినిమా ఈరోజుతో నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమా చాలామంది నాని అభిమానులకి ఫెవేరేట్ .

మరింత సమాచారం తెలుసుకోండి: