టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్ మల్టీస్టారర్ సినిమాలకు ట్రెండ్ సృష్టించిన హీరో అని చెప్పవచ్చు. ఎప్పటినుంచో టాలీవుడ్ లో ఈ ట్రెండ్ కొనసాగుతుండగా ఈ తరం హీరోలలో వెంకటేష్ ఈ తరహా సినిమాలు చేయడానికి పునాదులు వేశాడు. ఎదురుగా ఉన్నది చిన్న హీరో అయిన పెద్ద హీరో అయినా సినిమా కథ నచ్చితే వెంటనే ఒకే చెప్తాడు. అలా వెంకటేష్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి భారీ సినిమా మల్టీ స్టారర్ సినిమా తర్వాత ఆయన చేసిన మరో మల్టీ స్టారర్ సినిమా మసాలా. ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో కలిసి వెంకటేష్ తీసిన ఈ మల్టీస్టారర్ సినిమా తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. 

స్రవంతి మూవీస్ బ్యానర్ పై, సురేష్ ప్రొడక్షన్స్ పతాకాలపై స్రవంతి రవికిషోర్, సురేష్ బాబు దగ్గుబాటి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా 2013 నవంబర్ 14న విడుదల తెలుగు ప్రేక్షకులలను నవ్వుల పువ్వులు పూయించింది. అంజలి , షాజన్ పదాంసీ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి విజయభాస్కర్ దర్శకత్వం వహించగా బాలీవుడ్ లో రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన బోల్ బచ్చన్ సినిమాకు ఇది రీమేక్ఎ.స్.ఎస్.తమన్ సంగీతం సమకూర్చారు.

సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ కాగా టాలీవుడ్ లో కూడా  అదే విధంగా సూపర్ హిట్ అయ్యింది. తెలుగు ప్రేక్షకులను విపరీతం గా మెప్పించింది. మసాలా అన్న టైటిల్ కు కరెక్ట్ జస్టిఫికేషన్ చెబుతూ ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. గతంలో వెంకటేష్ ను ఇలాంటి పాత్రలో చూసినా కూడా రామ్ ను మాత్రం సరి కొత్తగా ఈ చిత్రంలో చూపించారు. అతని నటన సినిమా హిట్ అవడానికి కారణం అయ్యింది. వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. పేరుకు మసాలా అయిన ఈ సినిమా ప్రేక్షకులకు కామెడీని బాగా పండించింది. రామ్ హిజ్రా గా నటించిన తీరు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. టాలీవుడ్లో మరిన్ని మల్టీస్టారర్ సినిమాలు రావడానికి ఈ సినిమా విజయం ఎంతగానో దోహదపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: