పవన్ కళ్యాణ్..  ఈ పేరు వింటే చాలు అభిమానుల్లో ఏదో ధైర్యం..  అందరికీ పవన్ కళ్యాణ్ ఉన్నాడు అనే భరోసా..  పవన్ కళ్యాణ్ అభిమానులకు ఏమి చేశాడో తెలియదు కానీ ఏకంగా గుండెల్లో గుడి కట్టుకొని పూజిస్తూ ఉంటారు.  పవన్ కళ్యాణ్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక స్టార్ హీరో గా కంటే..  ఒక మంచి మనిషి గానే ఆయన అభిమానులకు బాగా నచ్చుతుంది.  ముఖ్యంగా ఆయన నిజాయితీ ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధుల్ని చేస్తుంది.  కోటీశ్వరుడు అయినప్పటికీ ఒక సామాన్యుడిగా జీవితం గడపడం కేవలం పవన్ కళ్యాణ్ కే సాధ్యం అయింది అని చెప్పాలి.



 అయితే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ గా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ జీవితం చిన్నప్పటినుంచి ఎలా సాగింది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.  పవన్ కళ్యాణ్ చిన్నప్పటినుంచే ఆస్తమాతో బాధపడుతున్న ఉండేవాడట.  ఈ క్రమంలోనే ఇక పవన్ తండ్రి కానిస్టేబుల్ గా ఉన్నప్పటికీ ఇక పవన్ కోసం మందులు కొనడానికి చాలా ఇబ్బందులు పడేవాడట.  కుటుంబ ఆర్థిక పరిస్థితులను అప్పుడే అర్థం చేసుకున్న పవన్ కల్యాణ్ చదువుపై  సరిగా దృష్టి పెట్టలేక పోయాడట. పవన్ కళ్యాణ్ నెల్లూరులోని దర్గామిట్ట ప్రాంతంలో ఉండే సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో చదువుకున్నాడు.



 అయితే ఓవైపు అనారోగ్యం.. మరోవైపు కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా..  ఇక పవన్ కళ్యాణ్ లోలోపల ఎంతో మదనపడే వాడట. దీంతో అటు చదువుపై సరిగ్గా శ్రద్ధ కనబరిచేవాడు కాదట పవన్ కళ్యాణ్.  ఈ క్రమంలోనే ఇక విద్యార్థి దశ కు ఎంతో కీలకమైన పదవతరగతి పరీక్షల్లో పవన్ ఫెయిల్ అయ్యాడట. సరిగ్గా అదే సమయంలో ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ నూ గద్దె దించి నాదెండ్ల భాస్కర్ రావు సీఎం పీఠాన్ని అధిరోహించారు. ఇక ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న నాదెండ్ల భాస్కరరావు తీసుకున్న నిర్ణయమే పవన్ కళ్యాణ్ టెన్త్ పాస్ అయ్యేలా చేసింది. టెన్త్ విద్యార్థులందరికీ కూడా ఐదు గ్రేస్ మార్కులు ఇస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు.  దీంతో ఇక టెన్త్ ఫెయిల్ అయిన పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయంతో పాస్ అయిపోయాడు. ఇక ఆ తర్వాత వి ఆర్ కాలేజీలో ఇంటర్ లో చేరారు పవన్ కళ్యాణ్.

మరింత సమాచారం తెలుసుకోండి: