
అయితే సోషల్ మీడియాలో సినీ సెలబ్రిటీలకు అప్పుడప్పుడు కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. నెటిజన్లు అసభ్యంగా కామెంట్లు చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాప్సీకీ కూడా ఇలాంటి ఒక చేదు అనుభవం ఎదురు కాగా ఘాటుగానే సమాధానం చెప్పింది. ప్రస్తుతం తాప్సీ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం రష్మీ రాకెట్. గుజరాతి స్పీంటర్ రష్మీ పాత్రలో ఈ సినిమాలో నటిస్తుంది తాప్సీ పన్ను. అయితే అచ్చం అథ్లెట్ లాగా శరీరాన్ని తయారుచేసుకోవడానికి తాప్సి ఎన్నో కష్టాలు పడింది. ఇక తాప్సీ పడిన కష్టం పై ఎంతో మంది ప్రముఖుల నుంచి ప్రశంసలు కూడా దక్కాయి.
ఇకపోతే ఈ సినిమాలో పాత్రకు సంబంధించి వెనక్కి తిరిగి ఉన్న ఒక ఫోటో ని ఇటీవలే సోషల్ మీడియాలో షేర్ చేసింది తాప్సీ పన్ను. ఎవరో చెప్పుకోండి అంటూ ఒక క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇక ఈ ఫోటో పై స్పందించిన ఒక నెటిజన్ ఇలాంటి బాడీ కేవలం తాప్సీ పన్ను కు మాత్రమే ఉంటుంది అంటూ ఒక అసభ్యకరమైన కామెంట్ చేశాడు. ఇక దీనిపై స్పందించిన తాప్సీ చెబుతున్న గుర్తుపెట్టుకో సెప్టెంబర్ 23 వరకు వేచి ఉండు. నేను ఈ ప్రశంస కోసం చాలా కష్టపడ్డాను మీకు ధన్యవాదాలు అంటూ ఘాటు రిప్లై ఇచ్చింది. సోషల్ మీడియాలో తాప్సీ స్నేహితులు కూడా ఈ అమ్మడికి సపోర్ట్ గా నిలుస్తూ ఉండటం గమనార్హం