టాలీవుడ్ లో అడుగుపెట్టి సక్సెస్ జోష్ తో ముందుకు సాగుతున్న యంగ్ హీరోలు ఎవరంటే అందులో నాగ శౌర్య పేరు ఖచ్చితంగా ఉంటుంది. డిగ్రీ చదువుతున్నప్పుడే సినిమాలలో నటించాలని తన ప్రొఫైల్ తో ఆఫీసుల చుట్టూ తిరిగే వాడట శౌర్య. కానీ టాలెంట్ ఉంటే ఇండస్ట్రీ లోకి ఎంట్రీ అంత కష్టమేమీ కాదు. అలానే తన ప్రతిభతో తెలుగు సినీపరిశ్రమలో అడుగుపెట్టి తన టాలెంట్ ను వెండి తెరపై కనబరిచి మెస్మరైజ్ చేశాడు నాగ శౌర్య. 2011 లో 'క్రికెట్, గర్ల్స్ అండ్ బీర్". అనే చిత్రంతో తన కెరియర్ ప్రారంభమైంది. ఆ చిత్రంలో నాగశౌర్యది చాలా చిన్న పాత్రే, సినిమా వచ్చి పోయిన విషయం కూడా పెద్దగా ఎవరికీ తెలియదు. అనంతరం ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో 2012 లో "చందమామ కథలు" చిత్రంలో నటించాడు. ఆ తర్వాత సరైన బ్రేక్ మాత్రం "ఊహలు గుసగుసలాడే" సినిమాతో వచ్చింది.

ఛలో, అశ్వద్ధామ చిత్రాలు  నాగ శౌర్య కెరియర్ బిగ్గెస్ట్ హిట్లు గా నిలిచాయి. ఈ హీరో మంచి స్పోర్ట్స్ మెన్ కూడా..రాష్ట్ర స్థాయిలో టెన్నిస్ క్రీడలో తన సత్తా చాటాడు. కానీ తనకు ఇష్టమైన సినీరంగంలో రాణించాలని ఇండస్ట్రీ వైపు నడవగా దాదాపు ఐదు సంవత్సరాల వరకు ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. అయినా విశ్రమించకుండా పట్టుదలతో ముందుకు సాగి తెలుగువారు గర్వించదగ్గ నటుడిగా మన ముందున్నారు ఈ యువ తార. అంతేకాదు "ఛలో" సినిమాకి తానే సొంతంగా స్క్రిప్ట్ రెడీ చేసుకోగా నిర్మాతలు నీకు అంత బడ్జెట్ పెట్టలేము అన్నారట. దాంతో నిర్మాతలు దొరకక బాధపడుతుంటే నాగశౌర్య తల్లిదండ్రులే ప్రొడ్యూసర్ లుగా మారి ఐరా క్రియేషన్స్ కొత్త బ్యానర్ ను ఆవిష్కరించి అందులో ఛలో చిత్రాన్ని నిర్మించారు. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అలా నాగశౌర్య నటుడిగానే కాక రైటర్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.  

కానీ ఈ విషయంలో నాగశౌర్యకు ఛలో డైరెక్టర్ వెంకీ కుడుములకు మధ్య వివాదం జరిగిన విషయం తెలిసిందే.  ఇక ఈ హీరో గురించి మరో విశేషం ఏమిటంటే... నాగశౌర్య మేనత్త తెలుగులో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేశారు అని ఈ మధ్య చాలా వార్తలు వినిపించాయి . ఆమె మరెవరో కాదు తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలైన లతా శ్రీ. "ఆ ఒక్కటి అడక్కు" చిత్రంలో రాజేంద్రప్రసాద్ చెల్లెలుగా మనల్ని అలరించిన లత శ్రీ నాగశౌర్య కు స్వయాన మేనత్త.  బహుశా ఆ బంధమే అతడిని సినీ రంగం వైపు ఆకర్షితుడు అయ్యేలా చేసిందేమో. కానీ లత శ్రీ తన మేనత్త అని నాగశౌర్య ఎప్పుడు ఎక్కడ చెప్పింది లేదు. దీనికి కారణం వారి కుటుంబాల మధ్య తగాదాలే అని ప్రచారం జరిగింది. కానీ అఫిషియల్ గా  దీనిపై క్లారిటీ రాలేదు.

ఈ యంగ్ హీరో మాత్రం తన స్వయంకృషితో ఎంతో కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కుతూ టాలెంటెడ్ హీరోగా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇండస్ట్రీలో నాగ శౌర్య స్నేహితులు అంటే మొదట నందిని రెడ్డి అని చెప్పొచ్చు. ఆ స్నేహంతోనే ఓ బేబీ చిత్రంలో నటించాడు నాగ శౌర్య. అలాగే  దర్శకుడు వెంకీ కుడుమల కూడా నాగ శౌర్యకు ముందు మంచి స్నేహితుడు. అదే అనుబంధంతో ఛలో చిత్రం చేశారు. కానీ ఈ సినిమా వల్ల వీరి మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా వీరి స్నేహం చెదిరిపోయింది.

ప్రస్తుతం నాగశౌర్య పవర్‌ఫుల్ చిత్రం "లక్ష్య" మరియు "వరుడు కావలెను" చిత్రాలలో నటిస్తున్నాడు. ఇవి అతి త్వరలోనే విడుదల కానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: