సాధారణంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఏదో ఒక సినిమాకు సంబంధించిన అంశం ఎప్పుడు హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. కానీ ఇటీవలి కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో   హాట్ టాపిక్ గా మారిన అంశం ఒక్కటే. అదే నాగచైతన్య సమంత విడాకులు విషయం.  మొన్నటి వరకూ టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మోస్ట్ క్యూట్ కపుల్స్ గా ఉన్న సమంత నాగ చైతన్య ఎవరూ ఊహించని విధంగా విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. అయితే ఒకరి పట్ల ఒకరు ఎంతో ప్రేమగా ఉండే వీరిద్దరూ అసలు విడిపోవడానికి కారణాలు ఏంటి అనే దానిపై ప్రస్తుతం అందరూ అయోమయంలో పడిపోయారు.



 ఒకరిని ఒకరు ఇష్టపడి ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకుని డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఒకటైన ఈ జంట కేవలం కొన్నేళ్లలోనే విడిపోవడం ఏంటి..  ఇద్దరూ విడిపోవడానికి వెనుక అంత పెద్ద కారణమేమీ ఉంది అంటూ అందరూ వెతకడం ప్రారంభించారు.  ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇక నాగచైతన్య సమంత విడాకులు తీసుకున్న తరువాత కొంతమంది సమంత ను ఉద్దేశిస్తూ కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.  సినిమాల పిచ్చి తో సమంత ఫ్యామిలీ ని పట్టించుకోలేదని..   పెళ్లయిన తర్వాత కూడా చిన్న చిన్న బట్టలు వేసుకోవడం వల్లే నాగచైతన్య సమంత కు విడాకులు ఇచ్చాడూ అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.



 ఇటీవలే సమంత పై వస్తున్న కామెంట్లపై హీరోయిన్ మాధవి లత స్పందిస్తూ షాకింగ్ కామెంట్ చేశారు.  సమంత క్రిస్టియన్ కాబట్టి విడిపోయారు అని చాలామంది అంటున్నారు. అయితే సమంత ఎప్పుడూ కూడా హిందూ దేవుళ్ల గురించి తప్పుగా మాట్లాడలేదు అంటూ మాధవీలత చెప్పుకొచ్చారు.  చిన్న బట్టలు వేసుకోవడం వల్ల విడాకులు తీసుకున్నారు అని అంటున్నారు. అలా అయితే ఇప్పటికే  చిత్ర పరిశ్రమలో ఎంతోమంది విడిపోయేవారు అంటూ మాధవి లత చెప్పుకొచ్చారు. సమంతకు తల్లి కావాలనే కోరిక ఉండేదని.. కానీ తల్లి కాకుండా అడ్డుకొని వరుసగా సినిమాలు చేయిస్తూ ఒక మెషిన్ లానే సమంతను చూశారని కోట్లు సంపాదిస్తున్న ఆమె.. ఆమెకి వేల రూపాయల చొప్పున పాకెట్ మని ఇచ్చేవారని మాధవి లత షాకింగ్ కామెంట్స్ చేస్తూ ఒక వీడియో కూడా విడుదల చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: