ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. సాధారణంగా కొంతమంది సినీ ఇండస్ట్రీలో ఉండే వాళ్లు పెద్దగా చదువుకోని ఉండరు అనే భావనలో ఉంటారు. ఇంకొంతమంది  అయితే చదువు అబ్బక సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు అనుకుంటారు. కానీ మన ఇండస్ట్రీలో పెద్ద పెద్ద చదువులు చదివిన వారు కూడా ఉన్నారు. ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు. ఇందులో దర్శకులు, నటులు కూడా ఉన్నారు. బీటెక్ లాంటి ఉన్నత చదువులు చదివిన వారు కూడా యాక్టింగ్ పై ఉన్న ఇంట్రెస్ట్ తో సినీ రంగంలోకి వచ్చి తమదైన శైలిలో నటిస్తూ మంచి గుర్తింపు చ్చుకున్న  వారు ఎవరు.. వాళ్లు ఏం చదువుకున్నారో ఇప్పుడు ఇక్కడ ఒకసారి చదివి తెలుసుకుందాం..!!

విక్టరీ వెంకటేష్ : దగ్గుబాటి రామనాయుడు వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వెంకటేష్ కు  చిన్నప్పటి నుంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలని ఆశ ఉండేదట.  అమెరికాలోని మానిటరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ లో MBA చదివారంటా.

నాగార్జున : అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున చెన్నైలో ఇంజినీరింగ్ పూర్తి చేసారు.అంతేకాదు అమెరికాలో ఆటోమొబైల్స్‌లో మాస్టర్స్ కూడా కంప్లీట్ చేసాడు.

బాలకృష్ణ: నందమూరి  వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ నట సింహం నైజాం  కాలేజీలో డిగ్రీ పూర్తి చేసారు.

వెన్నెల కిషోర్: కమెడియన్ వెన్నెల కిషోర్ బీటెక్ చదువుకున్నారు. అంతేకాదు అమెరికాలోని ఫెర్రిస్ స్టేట్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచ్‌లర్ డిగ్రీ కూడా పూర్తి చేసి.. కొంత కాలం సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా జాబ్ కూడా చేశాడు.

రాజశేఖర్ : యాంగ్రీ యంగ్ మెన్ హీరో రాజశేఖర్ ఎంబీబీఎస్  చదివారు. అంతేకాదు కొంతకాలం డాక్టర్ గా కూడా వర్క్ చేశారు.

సిద్దార్ధ్ : హీరో సిద్దార్ధ్ దేశ రాజధాని ఢిల్లీలో డిగ్రీ చదివి ఆ తరువాత..MBAలో మంచి మార్కులతో పట్టా అందుకున్నారు.

సాయి ధరమ్ తేజ్ : మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ లో ఎంబీఏ కంప్లీట్ చేశారు.
 
నాగ చైతన్య : నాగార్జున కోడుకుగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన బీకామ్ ఫస్ట్ క్లాస్ లో పాసయ్యారు. ఆ తరువాత  లండన్ లోని మ్యూజిక్ కాలేజీలో కీ బోర్డు కూడా నేర్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: