ప్రముఖ నటి అర్చన తన నటనతో హీరోయిన్ గా ఎదిగే అవకాశం వచ్చినప్పటికీ,  ఆమె తీసుకొనే కొన్ని నిర్ణయాలవల్ల స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదగలేక పోయింది. బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించినప్పటికీ అర్చనకు కలిసి రాలేదనే చెప్పాలి. ఇక తరువాత చిన్నచిన్న పాత్రలు పోషిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకుంది.. ఇకపోతే సాధారణంగా సినీ ఇండస్ట్రీ అంటేనే మాయ ప్రపంచం..ఈ  మాయ ప్రపంచం లో ఎవరు ఎలా ప్రవర్తిస్తారో కూడా చెప్పడం చాలా కష్టం. ముఖ్యంగా నటీనటులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు అనే విషయం కూడా తెలిసిందే.

ఇక హీరోల  విషయం పక్కన పెడితే హీరోయిన్ లు ఆర్టిస్టులు ఇలా ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.. తాజాగా ఒక ఇంటర్వ్యూ ఛానల్ కు  హాజరైన అర్చన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఇంటర్వ్యూ లో భాగంగానే మాట్లాడుతూ.. బాపు దర్శకత్వంలో వచ్చిన రాధాగోపాలం సినిమాలో నటించే అవకాశం వచ్చిందని , అదే సమయంలో నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంలో కూడా ఒక చిన్న పాత్ర రావడంతో ఈ సినిమాకు ఒప్పుకుని , అంత మంచి సినిమాను వదులుకున్నాను అని ఆమె తెలిపింది.

కానీ తన సినీ కెరీర్లో తనకు జరిగిన అవమానాలు , అనుభవాలను కూడా వెల్లడించింది. ఇంటర్వ్యూలో భాగంగానే ఈమెకు ఒక ప్రశ్న ఎదురవడంతో షాకింగ్ కామెంట్ చేసింది.. ఇండస్ట్రీ లో ఒక టాప్ డైరెక్టర్ ఉన్నారని , అతను కథ చెప్పేటప్పుడు ఒక రకంగా చెప్పి, షూటింగ్ చేసే సమయంలో డైలాగులు, కథ  కూడా మారుస్తూ ఉంటాడని చాలా ఇరిటేషన్ తెప్పిస్తూ ఉంటాడు అని తెలిపింది.

ఇది ఏంటి అని ప్రశ్నించినప్పుడు.. ఆ డైరెక్టర్ చెప్పే మాటలు వింటే మనమే తప్పు అనే భావన కలుగుతుందని ఆమె తెలియజేసింది.. సినీ ఇండస్ట్రీలో ఒక అమ్మాయి మైండ్ సెట్ చాలా వీక్ గా ఉందని తెలిస్తే, కచ్చితంగా ఆ అమ్మాయిని త్వరగా ట్రాప్ చేయడానికి ఎంతోమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు అని అలాంటి అనుభవం తనకు కూడా ఎదురైందని తెలిపింది. కానీ ఆ మైండ్ సెట్ నుంచి నేను తొందరగా  రియాక్ట్ కావడం వల్ల సమస్య నుంచి బయట పడ్డాను అని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: