తెలుగు అమ్మాయి ఈశా రెబ్బ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా తో సినిమాల్లోకి తెరంగేట్రం చేసింది, ఈ సినిమాలో ఈ ముద్దు గుమ్మ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా తన రెండవ సినిమా  అంతకు ముందు ఆ తర్వాత తో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ తన అందంతో, నటనతో ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి మంచి నటన మరియు అందం ఉన్న ఒక తెలుగు అమ్మాయి దొరికింది. ఆ తర్వాత ఈషా రెబ్బ అమీ తుమి , అ! వంటి సినిమాల్లో నటించి తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇలా చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత సినిమాలో రెండో హీరోయిన్ గా కనిపించి తన పాపులారిటీని ఫుల్ గా పెంచుకుంది.

 ఈ ఈషా రెబ్బ కేవలం సినిమా లతో  మాత్రమే కాకుండా పిట్ట కథలు, త్రీ రోజెస్ వంటి వెబ్ సిరీస్ లతో కూడా ప్రేక్షకులను అలరించింది. ఇలా తెలుగు ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మలయాళ సినిమాలలో కూడా నటిస్తుంది. ఈషా రెబ్బ ఒట్టు’ అనే మలయాళ చిత్రంలో నటించింది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పూర్తి అయ్యింది. అరవింద స్వామి కీలక పాత్రలో నటించిన ఈ మూవీలో ఈషా రెబ్బ మంచి ప్రాముఖ్యత ఉన్న పాత్రలో నటించింది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి అవడంతో ఈషా రెబ్బ ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంది. షూటింగ్ స్పాట్ కు సంబంధించిన ఒక ఫోటోను ఈషా రెబ్బ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ.. నా తొలి మలయాళం మూవీ చిత్రీకరణ నాకు మరిచిపోలేని అనుభూతిని ఇచ్చింది అంటూ రాసుకొచ్చింది. మరి మొదటి  మలయాళం సినిమాతో ఈషా రెబ్బ ఎలాంటి గుర్తింపును తెచ్చుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: