
అనిల్ కపూర్ కొడుకు హర్షవర్ధన్ కపూర్ హీరోగా ఎంట్రీ ఇచ్చి అయిదేళ్లు దాటింది. కానీ ఇప్పటి వరకు చోటా కపూర్‌కి పెద్దగా స్టార్డమ్ రాలేదు. అక్క సోనమ్ కపూర్‌కి ఉన్నంత ఫాలోయింగ్ కూడా తమ్ముడికి లేదని బాలీవుడ్ టాక్. అనిల్ కపూర్, సన్నీ దేవల్ లాంటి హీరోలు వారసులకి గుర్తింపు రాలేదని తెగ బాధపడుతోంటే, షారుక్ ఖాన్ మాత్రం ఆర్యన్ ఖాన్‌కి వచ్చిన పాపులారిటీతో డిసప్పాయింట్ అవుతున్నాడు. ఈ ఏడాది యాహూ మోస్ట్ సెర్చ్‌డ్ సెలబ్రిటీస్‌లో 7వ స్థానంలో నిలిచాడు ఆర్యన్ ఖాన్.
షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాక నెలరోజుల పాటు ఎన్.సి.బి. కస్టడీలో ఉన్నాడు. ఆనెల రోజులు నేషనల్ మీడియా ఆర్యన్ చుట్టూనే తిరిగింది. నెటిజన్లు కూడా ఆర్యన్ గురించి వెతకడం మొదలుపెట్టారు. కానీ డ్రగ్స్‌తో ఆర్యన్‌కి సంబంధం లేదని తర్వాత కోర్టు బెయిల్ ఇచ్చినా, కొడుకు క్యారెక్టర్‌పై మచ్చ పడిందని ఫీలవుతున్నాడట షారుక్. అయితే సంజయ్ దత్, సల్మాన్ ఖాన్‌కి బాలీవుడ్‌లో బ్యాడ్‌బాయ్స్ అనే మార్క్ ఉన్నా సినిమాలు చేస్తున్నారు. అలాగే ఆర్యన్‌కి కూడా ఏదో ఒక రూపంలో పాపులారిటీ వచ్చింది బాధపడకు అని షారుక్‌ని ఓదారుస్తున్నారట సన్నిహితులు. మొత్తానికి షారుఖ్ ఖాన్ కుమారుడు.. ఒక్క సినిమా కూడా చేయకుండానే సెలబ్రెటీ క్రేజ్ సంపాదించుకున్నాడు .