ఈ వారం సినిమా ఇండస్ట్రీలో ఓ హాట్ టాపిక్ తెగ వైరల్ అయిపోయింది. టాలీవుడ్, కోలివుడ్ ఇండస్ట్రీలో తన కంటూ ఓ ఇమేజ్ ఉన్న హీరోయిన్ సమంతా. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలతో తనేమిటో ఇప్పటికే ప్రూవ్ చేస్తుకున్నారు కూడా. ఇక అటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా తెగ దగ్గర అయి పోయారు సమంతా. తెలుగు పరిశ్రమలో దాదాపు అందరు అగ్ర హీరోలతో కూడా సమంత యాక్ట్ చేశారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో అత్తారింటి దారేదీ అంటూ మురిపించారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో దూకుడు చేసేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో బృందావనంలో సందడి చేశారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో సన్ ఆఫ్ సత్యమూర్తి అంటూ అందరినీ అలరించారు. అదే సమయంలో తన మొదటి ఏం మాయ చేశావే సినిమా హీరో నాగ చైతన్యతో లవ్ ట్రాక్ నడిపారు సమంత. వీరిద్దరి పెళ్లి కూడా పెద్దల అంగీకారంతో అంగరంగ వైభవంగా సాగింది. ఈ వివాహ వేడుకకు పరిశ్రమకు చెందిన ఎంతో మంది పెద్దలు హాజరై ఈ జంటను ఆశీర్వదించారు కూడా.

పెళ్లి తర్వాత సమంత సినిమాలు ఆపేస్తారని అంతా అనుకున్నారు. కానీ సమంత మాత్రం ఫుల్ ఫ్యామిలీ మూవీస్‌తో అటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటూ ఇటు కమర్షియల్‌గా కూడా హిట్ సాధించారు. ఇందులో ఓ బేబీ సినిమా హైలెట్. ఇక మజీలి, జాను సినిమాలతో సమంత సూపర్ అనే టాక్ తెచ్చుకున్నారు కూడా. ఇదే సమయంలో హిందీలో వచ్చిన ది ఫ్యామిలీ మ్యాచ్ వెబ్ సిరీస్ ద్వారా అందరినీ అలరించారు. అయితే ఇదే సమయంలో కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు కూడా తలెత్తాయి. చివరికి చైతుతో నాలుగేళ్ల వివాహ బంధానికి కూడా బ్రేక్ అప్ చెప్పేశారు సమంత. ఇప్పటి వరకు ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరైన సమంతా... ఇప్పుడు మరో డిఫరేంట్ రోల్‌ చేస్తున్నారు. పుష్ప సినిమా ఫస్ట్ పార్ట్‌లో ఏ స్పెషల్ సాంగ్‌లో కనిపిస్తున్నారు. ఫుల్ మాస్ సాంగ్ గా వస్తున్న ఈ పాటలో ఇప్పటికే సమంత తన అందాలను ఆరబోసినట్లు కనిపిస్తోంది. ఫుల్ డబుల్ మీనింగ్ డైలాగులతో ఉన్న ఇలాంటి పాటలో చేయడంతో.... సమంతా కూడా ఇలా చేస్తారా అని అంతా ఆశ్చర్యపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: