భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ - బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అనుష్క శర్మ ప్రేమ అప్పట్లో పెద్ద సంచలనం. వారు ప్రేమించుకుంటున్న టైంలో విరాట్ కోహ్లీ ఏ దేశంలో క్రికెట్ ఆడుతున్నా కూడా అనుష్క శర్మ అక్కడ వాలి పోయేది. కోహ్లీ ఫోర్లు , సిక్సర్లు కొడుతుంటే గ్రౌండ్ లో అనుష్కశర్మ నానా హంగామా చేసేది. అరుపులు , కేకలు మామూలుగా ఉండేవి కాదు. అనుష్క తన స్నేహితుల  తో స్టేడియం నుంచి విరాట్ వైపు చూస్తూ చిరునవ్వులు చిందిస్తూ .. ఫ్లైయింగ్ కిస్ లు ఇచ్చేది.

నేషనల్ మీడియా తో పాటు ఇంటర్నేషనల్ మీడియాలో కూడా ఈ జంట బాగా హైలెట్ అయ్యేది. ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకుని ఫ్యామిలీ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు. కొద్ది నెలల క్రితమే విరుష్క దంపతులు తల్లిదండ్రులు కూడా అయ్యారు. ఇక విరాట్ కోహ్లీ భారత జట్టు స్టార్ క్రికెటర్ గా ఉన్నారు. అనుష్క శర్మ నిన్నటి వరకు కూడా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఉంది. ఈ జంటకు ప్రపంచంలోనే భారీ స్థాయిలో సోషల్ మీడియా ఫాలోవర్స్ ఉన్నారు.

వీరు బయటకు వస్తే వీరిని చూసేందుకు జనాలు ఎంత ఎగబడతారో తెలిసిందే. ఈ క్రమంలోనే వీరిని అనుక్షణం కాపాడే బాడీగార్డ్ కోసం మీరు ఇచ్చే వేత‌నం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. కోహ్లీ, అనుష్కను అనుక్షణం కాపాడే బాడీగార్డ్‌ ప్రకాశ్‌ సింగ్‌ ఉరఫ్‌ సోనుకు అక్షరాలా ఏడాదికి కోటీ 20 లక్షల వేతనం ఇస్తున్నార‌ట‌. అత‌డు చాలా ఫిట్ గా ఉండి.. విరుష్క జోడికి కంటికి రెప్ప‌లా కాపాడు కుంటూ వ‌స్తాడు.

ఇక ఈ జీతం చాలామంది కార్పొరేట్‌ కంపెనీ సీఈఓలకు లభించేదానికన్నా ఎక్కువే అని అంటున్నారు.  మ‌నోడిని కూడా వీరుష్క దంప‌తులు ఎంతో అన్యోన్యంగా .. సొంత కుటుంబ స‌భ్యుడిలా చూసుకుంటూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: