ఆది సాయి కుమార్, నువేక్ష జంటగా పొలిమేర నాగేశ్వర్ డైరెక్ట్ చేసిన సినిమా అతిథి దేవోభవ. టీజర్, ట్రైలర్ ఆసక్తికరంగా అనిపించగా సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆది సాయి కుమార్ అతిథి దేవోభవ ఎలా ఉందో ఈనాటిసమీక్షలో చూద్దాం.

కథ :

చిన్నప్పటి నుండి మోనో ఫోబియో ఉన్న వ్యక్తి అభయ్ (ఆది సాయికుమార్). ఒంటరితనం భరించలేని అతను ప్రతి నిమిషం ఎవరో ఒకరు మనిషి తోడు ఉండాలని కోరుతాడు. ఈ క్రమంలో అతనికి వైష్ణవి (నువేక్ష)తో పరిచయం ఏర్పడుతుంది. ఆమె ప్రేమలో పడతాడు అభయ్. వైష్ణవి కూడా అభయ్ ని ప్రేమిస్తుంది. ఆమె దగ్గర తన సమస్య గురించి దాచి పెడతాడు అభయ్. ఇంతకీ అభయ్ కు అసలు మోనొ ఫోభియో ఎందుకు ఏర్పడింది..? అతను దాని నుండి ఎలా బయటపడ్డాడు..? నువేక్షని అభయ్ దక్కించుకున్నాడా లేదా అన్నది సినిమా కథ.

విశ్లేషణ :

దర్శకుడు పొలిమేర నాగేశ్వర్ ఎంచుకున్న పాయింట్ బాగాఏ ఉన్నా దాన్ని సినిమాగా మలచడంలో పొరపాట్లు చేశాడని చెప్పొచ్చు. కథ బాగానే అనిపించినా స్క్రీన్ ప్లేలో గ్రిప్పింగ్ లేకపోవడం మైనస్ గా మారింది. దర్శకుడిగా సినిమా విషయంలో ప్రతిభ కనబరచలేకపోయాడు నాగేశ్వర్.

హీరో క్యారక్టర్ అతనికి ఉన్న మోనో ఫోబియా సమస్య తప్ప సినిమాలో మరో పాయింట్ లేదు. పాత్రలని సహజంగా రాసుకున్నా సరే వాటి మధ్య ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యేలా మాత్రం చేయలేదు. ఫస్ట్ హాఫ్ జస్ట్ ఓకే అనిపించగా సెకండ్ హాఫ్ మరీ సాగదీతగా అనిపిస్తుంది.

దర్శకుడు ఓ మంచి అవకాశాన్ని మిస్ యూజ్ చేసుకున్నాడని చెప్పొచ్చు. కథ మాత్రమే కాదు ప్రేక్షకులను మెప్పించాలంటే కథనం కూడా చాలా ఇంపార్టెంట్. ఆ విషయంలో అతిథి దేవోభవ మెప్పించలేదు.

నటీనటుల ప్రతిభ :

ఆది తన వరకు బాగానే చేశాడు. రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో తన ప్రతిభ కనబడుతుంది. నువేక్ష జస్ట్ ఓకే అనిపిస్తుంది. రోహిణి నటన ఆకట్టుకుంది. సప్తగిరి, రవి వర్మ, జబర్దస్త్ ఇమ్మాన్యుయల్ సినిమాలో మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.

సాంకేతికవర్గం పనితీరు : 

టెక్నికల్ గా కూడా ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. శేఖర్ చంద్ర మ్యూజిక్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. అమర్నాథ్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ పర్వాలేదు. కథ, కథనంలో దర్శకుడు పూర్తిగా మెప్పించలేకపోయాడు. ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు అనిపించేలా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :

ఆది సాయి కుమార్

మ్యూజిక్

మైనస్ పాయింట్స్ :

డైరక్షన్

స్లో నరేషన్

మిస్సింగ్ ఎంటర్టైన్మెంట్

బాటం లైన్ :

అతిథి దేవోభవ.. ఆది సాయి కుమార్ మళ్లీ నిరాశపరచాడు..!

రేటింగ్ : 2/5

మరింత సమాచారం తెలుసుకోండి: