బాలకృష్ణ అఖండ సినిమాతో బోయపాటి శ్రీను కాంబినేషన్లో హ్యాట్రిక్ విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే బాలకృష్ణ సూపర్ హిట్ విజయాన్ని అందుకుని ఇప్పుడు మరొకసారి క్రాక్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107 వ సినిమాని నిర్మించబోతున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు నటించబోతున్నారు అనే విషయాన్ని ఇప్పటివరకు తెలియజేయలేదు. ఇదిలా ఉండగా ఈ రోజు శృతిహాసన్ పుట్టిన రోజు సందర్భంగా ఈసినిమా టీమ్ ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నే బాలకృష్ణ సరసన శృతి హాసన్ ఎంపికయింది.


అంతేకాదు ఈ సినిమా నుంచి ఆమెకు సంబంధించిన ఒక ఫోటోను పోస్ట్ చేస్తూ హ్యాపీ బర్తడే శృతిహాసన్ అంటూ తెలియజేయడం విశేషం. ఇదిలా ఉండగా  సలార్ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ప్రత్యేకంగా శృతి హాసన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.. ఆయన తన ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు శృతిహాసన్.. మీరు ఈ సినిమాలో భాగమైనందుకు.. అంతేకాదు సెట్ కి  కొత్త రంగులను తీసుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మీ వల్ల సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని ప్రశాంత్ నీల్  వెల్లడించారు. ఇక పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ప్రశాంత్ నీల్ తెలియజేశారు. ఇక ఏది ఏమైనా ప్రభాస్సరసన శ్రుతిహాసన్ ఈ సినిమాలో నటిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే.
ఇక వీరే కాదు ఎంతో మంది స్టార్ ప్రముఖులు కూడా శృతి హాసన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈమె తాజాగా వరుస సినిమాలతో బిజీ అవుతూ .. మళ్లీ తన స్టార్ స్టేటస్ ను తిరిగి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలకు ఓకే చేస్తున్న శృతిహాసన్ త్వరలోనే మరో స్టార్ హీరో సరసన నటించడానికి సిద్ధం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: